ట్రంప్‌ విధానాలతో ఐటీ వృద్ధికి విఘాతం

30 May, 2017 04:07 IST|Sakshi
ట్రంప్‌ విధానాలతో ఐటీ వృద్ధికి విఘాతం

టెక్‌ మహీంద్రా వైస్‌ చైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ వీసా విధానాలు దేశీ ఐటీ రంగ వృద్ధిని తీసే ప్రమాదముందని టెక్‌ మహీంద్రా వైస్‌ చైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే నినాదంతో హెచ్‌1బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడం ఐటీపై ప్రతికూల ప్రభావం చూపనుందని ఆయన పేర్కొన్నారు.

వీసా కోటాలు, కేటాయింపులు మొదలైన విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోవచ్చని, అమెరికాలో నిష్ణాతుల సేవలను వినియోగించుకోవాలనుకునే భారత ఐటీ కంపెనీల వ్యయాల భారం పెరగనుందని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో నయ్యర్‌ చెప్పారు. మార్చి త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా లాభం 31 శాతం క్షీణించి రూ. 588 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఆర్థిక సేవల సంస్థలు కంపెనీ షేరు ధర టార్గెట్‌లను రూ. 380 స్థాయి దాకా తగ్గించాయి.

మరిన్ని వార్తలు