గో-బిజ్‌తో టీహబ్ ఒప్పందం

4 Jun, 2016 20:15 IST|Sakshi

హైదరాబాద్: అమెరికాలోని ‘ఐ హబ్’లతో తెలంగాణ ‘టీ హబ్’ను అనుసంధానం చేసేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం కాలిఫోర్నియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. సంయుక్త ఆవిష్కరణలు, ప్రత్యామ్నాయ ఇంధనంలో పరస్పర సహకారం, పర్యావరణ సాంకేతికత, ఆరోగ్యం, వ్యవసాయం, సాంకేతికత ఆధారిత పారిశ్రామిక రంగం, వాణిజ్య ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగం తదితరాలపై ఇరు ప్రాంతాల నడుమ ఒప్పందం కుదిరింది. సిలికాన్ వ్యాలీ, తెలంగాణ నడుమ వినూత్న ఆలోచనల మార్పిడికి.. కాలిఫోర్నియా ఒప్పందంతో కొత్తమార్గం ఏర్పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఐ హబ్‌లతో అనుసంధానం
రెడ్డింగ్ మొదలుకుని సాన్‌డీగో వరకు సుమారు 15 ప్రముఖ ఐహబ్‌లు.. అమెరికాలోనే అతి పెద్ద ‘గో-బిజ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్’గా ఏర్పడ్డాయి. ప్రస్తుత ఒప్పందం ద్వారా గో బిజ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌తో టీ హబ్ అనుసంధానమవుతుంది. తద్వారా టీ హబ్‌లోని తమ భాగస్వామ్య సంస్థలు, కంపెనీలతో కాలిఫోర్నియాలోని ఐ హబ్‌లు వినూత్న ఆలోచనలను పంచుకునేందుకు వీలవుతుంది.

మరిన్ని వార్తలు