తెలంగాణలో రియల్ అవకాశాలు!

12 Dec, 2015 02:16 IST|Sakshi
తెలంగాణలో రియల్ అవకాశాలు!
  • హైదరాబాద్‌కు దీటుగా ద్వితీయ శ్రేణి పట్టణాలు
  •  పరిశ్రమలు, స్థిరాస్తి అభివృద్ధికి బోలెడన్నీ అవకాశాలు
  •  ప్రభుత్వం కాసింత చొరవ చూపితే మరింత వృద్ధి
  •  ‘సాక్షి రియల్టీ’తో క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి
  •  
     సాక్షి, హైదరాబాద్:
    తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి కొనుగోలు చేయాలన్నా.. పెట్టుబడులు పెట్టాలన్నా భాగ్యనగరం ఒక్కటే లేదు.. ఇతర జిల్లాల్లోనూ అభివృద్ధి అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి.  నిజం చెప్పాలంటే.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌తో సమాంతరంగా జిల్లా కేంద్రాల్లోనూ స్థిరాస్తి ధరలు పెరిగాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వమూ ప్రణాళికలు రచిస్తుండటంతో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారమూ బాగానే సాగుతోందంటున్నారు భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ రాష్ర్ట ప్రప్రథమ అధ్యక్షులు గుమ్మి రాంరెడ్డి.

     తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన ప్రాంతమేదైనా ఉందంటే అది వరంగలే. హైదరాబాద్, సికింద్రాబాద్‌లు జంట నగరాలుగా ఎలా పేరుగాంచాయో అలాగే వరంగల్, హన్మకొండ, కాజీపేటలను ట్రై సిటీస్‌గా పిలుస్తారు.
     
      దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీ జాబితాలో వరంగల్‌కూ చోటుదక్కింది. పెపైచ్చు వరంగల్‌ను టెక్స్‌టైల్స్ హబ్ తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి వరంగల్ మీదే పడింది.
     
      ఐటీ రంగ అభివృద్ధికి వరంగల్ అనుకూలమనే చెప్పాలి. ఇప్పటికే మడికొండలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేసేం దుకు 30 ఎకరాలను స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా ప్రకటిం చారు కూడా. ఐటీ ఇక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కోసం భవనాన్ని కట్టారు. దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌కు వం ద కి.మీ. దూరంలో ఉండటం, గతంలో ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం వంటివి ఐటీ కంపెనీలకు కలిసొస్తున్నాయి.
     
     విద్యా, వైద్య, వినోదాలకూ..

     ఇప్పటికే ఎన్‌ఐటీ, కిట్స్ వంటి అంతర్జాతీయ విద్యా సంస్థలతో పాటుగా పేరుగాంచిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాలయాలు, షాపింగ్ మాళ్లకూ కొదవేలేదిక్కడ. హన్మకొండలో కేఎఫ్‌సీ, డీ-మార్ట్, బిర్లా గ్రూప్ సంస్థలున్నాయి, నర్సంపేట్ రోడ్‌లో వాల్‌మార్ట్ రాబోతోంది. నక్కలగుట్ట, కేయూ వర్శిటీ వంటి ప్రాంతాల్లో మెయిన్ రోడ్‌కిరువైపులా గజం ధర రూ.లక్షకు పైగా, వరంగల్, హన్మకొండ, కాజీపేట చౌరస్తాల్లో అయితే రూ.2 లక్షలుంది. ఫ్లాట్లయితే రూ.2,200 నుంచి 3,000 మధ్య విక్రయిస్తున్నారు.
     
     వరంగల్ అభివృద్ధి మాస్టర్‌ప్లాన్ అనుమతితోనే ముడిపడి ఉంది. నేటిక్కడ 1971 నాటి మాస్టర్‌ప్లాన్‌నే అమలులో ఉంది. దీంతో అభివృద్ధి నాలుగు వైపులా సమాంతరంగా విస్తరించట్లేదు. కొత్త మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్‌ను రూపొందించారు కానీ, ప్రభుత్వ ఆమోదముద్ర పడలేదు. అయితే నిర్మాణ అనుమతుల కోసం మున్సిపాలిటీకి వెళితే మాత్రం కొత్త మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారమే రోడ్లు, ఖాళీ స్థలాలను వదలమని చెబుతున్నారు. అసలు ప్లాన్ అమలులోకి రాకముందే నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారు. పోనీ నిబంధనలను పక్కాగా పాటిస్తే మాస్టర్ ప్లాన్ ప్రకారం రావాల్సిన రిలాక్సేషన్స్ ఇవ్వట్లేదు మరి.
     
     ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు నాలుగు లైన్ల రహదారి కొంత దూరమే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నిధులను మంజూరు చేసి.. పనులను వేగవంతం చేయాలి. అలాగే వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ తగ్గుతుంది. వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది కూడా.
     పారిశ్రామిక ప్రాంతాల నుంచి ప్రధాన నగరాలకు రైల్వే కనెక్టివిటీ, త్రినగరాలను అనుసంధానిస్తూ పారిశ్రామిక వాడలకు రేడియల్ రోడ్లను, భవిష్యత్తు ట్రాఫిక్ చిక్కుల్లేకుండా ప్రధాన కూడళ్ల వద్ద ముందస్తు ఇంటర్ చేంజ్ వంతెనలను నిర్మించాలి.
     
     తెలంగాణలో నాల్గో అతిపెద్ద నగరం కరీంనగర్. 3 లక్షల జనాభాతో 11,823 చ.కి.మీ. పరిధిలో ఉన్న ఈ జిల్లా.. దక్షిణాదిలోనే ఏకైక బొగ్గు గని సింగరేణి, 2,600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రామగుండం ఎన్టీపీసీలతో దేశంలో గుర్తింపు పొందింది.
     
    ఖనిజాలు, పత్తి, నూనె పంటలకు కరీంనగర్ పేరుగాం చింది కాబట్టి ఇక్కడ వ్యవసాయ,  ఖనిజాధారిత, అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పవచ్చు.
     
     ళీ ఐదారేళ్ల క్రితం వరకూ ఇక్కడ ఐదంతస్తుల భవనాలే కనిపించేవి. కానీ, ఇప్పుడు హైరేజ్ భవ నాలనూ నిర్మిస్తున్నారు. రిలయన్స్ మెగామార్ట్, కేఎఫ్‌సీ, మెగ్ డొనాల్డ్ వంటి ఫుడ్ సెంటర్లూ ఇక్కడికి రానున్నాయి. చ.అ.కు రూ.2,200-2,700 చెబుతున్నారు.
     
     కరీంనగర్‌లో ఐటీ హబ్ ఏర్పాటు, పారిశ్రామిక సంస్థల స్థాపనకు కృషి చేయాలి. అప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి నిర్మాణ రంగం కోలుకుంటుంది. కరీంనగర్‌కు ఔటర్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తే ట్రాఫిక్ తగ్గడమే కాకుండా వందల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది. షామీర్‌పేట్ రోడ్‌ను అభివృద్ధి చేస్తే హైదరాబాద్‌కు సులువుగా చేరుకోవచ్చు.
     
     దాదాపు 2 లక్షల జనాభాతో.. 10 కి.మీ. మేర విస్తరించి ఉన్న ఖమ్మంలో.. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ పట్టణం 25 కి.మీ. మేర అభివృద్ధి చెందుతుంది. విజయవాడకు పక్కనే ఉండటంతో వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు ఖమ్మం కేంద్ర బిందువు.
     
     ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రూ.2,576 కోట్ల విలువ చేసే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, రూ.11,474 కోట్ల విలువ చేసే భారీ, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ఖమ్మం చు ట్టూ 2 వేలకు పైగా గ్రానైట్ పరిశ్రమలున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 20 వేల మంది, పరోక్షంగా 60 వేల మంది ఉ పాధి పొందుతున్నారు. ఇక్కడి వనరులు, అభివృద్ధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తే మరిన్ని పరిశ్రమలొస్తాయి.
     
     స్థానికంగా ఉన్న ఖనిజ వనరులను ఉపయోగించుకొని బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. మణుగూరులో రూ.7,296 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కేటీపీసీ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, సత్తుపల్లిలోని బుగ్గపాడులో నిర్మిస్తున్న మెగా ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్‌లను సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం రావటంతో పాటుగా స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలొస్తాయి.
     
      ఖమ్మంలో సామాన్య, మధ్య తరహా కార్మికుల సంఖ్య ఎక్కువ కాబట్టి.. రిజిస్ట్రేషన్‌లో 5 శాతం రాయితీ ఇస్తే ప్రజలకు భారం తగ్గుతుంది. ఇక్కడ స్థిరాస్తి ధరలు చ.అ.కు రూ.2,000-2,600 మధ్య ఉన్నాయి.
     

>
మరిన్ని వార్తలు