రోమింగ్ చార్జీలు తగ్గాయ్..

1 May, 2015 01:06 IST|Sakshi
రోమింగ్ చార్జీలు తగ్గాయ్..

కాల్ చార్జీలు 40 శాతం వరకూ
- ఎస్‌ఎంఎస్ చార్జీలు 75% వరకూ
- నేటి నుంచి వర్తింపు

న్యూఢిల్లీ: రోమింగ్ చార్జీలు దిగివస్తున్నాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి దిగ్గజ టెలికాం కంపెనీలు రోమింగ్ చార్జీలను 75 శాతం వరకూ తగ్గించాయి. ఈ తగ్గింపు నేటి (మే1-శుక్రవారం) నుంచి అమలవుతుంది. రోమింగ్‌లో ఉన్నప్పుడు కాల్స్ చార్జీలు 40 శాతం వరకూ, ఎస్‌ఎంఎస్ చార్జీలు 75 శాతం వరకూ తగ్గాయి.  

గత నెల 9న టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నేషనల్ రోమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్ టారిఫ్‌ల పరిమితులను తగ్గించింది. దీంతో టెలికం కంపెనీలు తాజా నిర్ణయం తీసుకున్నాయి.
 ఎయిర్‌టెల్: ఇన్‌కమింగ్ కాల్ రేట్లు 40 శాతం వరకూ, అవుట్ గోయింగ్ (ఎస్‌టీడీ) కాల్ రేట్లు 23 శాతం వరకూ. అవుట్ గోయింట్ లోకల్ కాల్ రేట్లు 20 శాతం వరకూ,  లోకల్ ఎస్‌ఎంఎస్ రేట్లు 75 శాతం వరకూ, ఎస్‌టీడీ ఎస్‌ఎంఎస్ రేట్లు 74 శాతం వరకూ తగ్గించింది.
 
ఐడియా సెల్యులర్:
ఇన్‌కమింగ్ కాల్స్‌ను 40 శాతం తగ్గించింది.  అవుట్ గోయింగ్ లోకల్ కాల్ రేట్లను 20 శాతానికి, అవుట్ గోయింగ్ ఎస్‌టీడీ కాల్ రేట్లను 23 శాతం చొప్పున తగ్గించింది.  

ఆర్‌కామ్: ఇన్‌కమింగ్ కాల్స్ చార్జీలను 40 శాతం తగ్గించామని వివరించింది. అవుట్ గోయింగ్ కాల్స్ (లోకల్, ఎస్‌టీడీల) చార్జీలను 23 శాతం వరకూ తగ్గించామని పేర్కొంది.

మరిన్ని వార్తలు