ఫ్రీ డేటా, వాయిస్‌ ఆఫర్లకు ఇక రాం రాం?

17 Jul, 2017 13:17 IST|Sakshi
ఫ్రీ డేటా, వాయిస్‌ ఆఫర్లకు ఇక రాం రాం?

న్యూఢిల్లీ: టెలికాం సెక్టార్‌లో ఎదురవుతున్న ఆర్థిక ఒత్తడి, నష్టాల నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు అష్టకష్టాలు పడుతున్నాయి.  ఒకవైపు జియో చెక్‌ చెప్పడంతోపాటు,  కష్టాల గట్టెక్కేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీస ధరలను ఫిక్స్‌ చేయాల్సిందిగా టెలికం ఆపరేటర్లు మార్కెట్‌ రెగ్యులేటరీని ఆశ్రయించాయి. 

డేటా ,వాయిస్ కాల్స్ రెండింటికీ కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించాలని కోరతూ  కొన్ని టెలికాం ఆపరేటర్లు భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ను  ఆశ్రయించాయి.  దీంతో ట్రాయ్‌   జూలై 21 న 'కనీస ఫ్లోర్ ధర'  అంశంపై అన్ని  సర్వీసు ప్రొవైడర్ల  అభిప్రాయాలు,  వాదనలు కోరనుంది. దీంతో ఉచితడేటా, వాయిస్‌ సేవలకు త్వరలోనే ముగింపు  పడనుందా అనే  ఊహాగానాలు పరిశ్రమ వర్గాల్లో నెలకొన్నాయి. 

పరిశ్రమ ఆర్థిక నష్టాలను, పెరుగుతున్న ఆర్ధిక ఒత్తిడిని నొక్కి చెప్పిన  ఐడియా  గత నెలలో రెగ్యులేటర్‌ ఇండస్ట్రీ పరిశ్రమలు,  అంతర్ మంత్రిత్వ గ్రూపు (ఐఎంజీ)  భేటీ సందర్భంగా  ఫ్లోర్ ధర నిర్ణయం డిమాండ్‌ను ప్రస్తావించింది.

కాగా  టెలికాం సెక్టార్ లోకి రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన  మొత్తం ఆర్థిక పరిస్థితినే మార్చి  వేసింది.   ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌తో మార్కెట్లోకి  ఎంట్రీ ఇచ్చని ఇతర  దిగ్గజ కంపెనీలను పలు ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వాటి లాభాలను, ఆదాయాలను భారీగా ప్రభావితం చేసింది.  అంతేకాదు ఆయా కంపెనీల మొత్తం టారిఫ్‌ ప్లాన్లలో పెను మార్పులకు   నాంది పలికింది.   ప్రధానంగా టెలికాం మేజర్‌ను భారతీఎయిర్‌టెల్‌ను బాగా దెబ్బ కొట్టింది.   ఐడియా, వోడాఫోన్‌, ఆర్‌కామ్‌ ఇదే  వరుసలో ఉన్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు