ఆశలు చిగురించాయి : కోటికి పైగా ఉద్యోగాలు

29 Mar, 2018 16:27 IST|Sakshi

కన్సాలిడేషన్‌ ప్రక్రియతో భారీగా ఉద్యోగాలు కోల్పోతున్న టెలికాం ఇండస్ట్రిలో ఆశలు చిగురిస్తున్నాయి. టెలికాం ఇండస్ట్రీ వచ్చే ఐదేళ్లలో కోటికి పైగా ఉద్యోగవకాశాలను కల్పించనుందని ఈ రంగానికి చెందిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ బాడీ పేర్కొంది. టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం 40 లక్షల మంది ఉద్యోగాలు పొందుతున్నారని, వచ్చే ఐదేళ్లలో టెలికాం, టెలికాం తయారీలో 1.4 కోట్ల మంది ఉద్యోగవకాశాలు పొందనున్నారని టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ సీఈవో ఎస్‌ పీ కొచ్చర్‌ తెలిపారు.  

అయితే గతేడాది టెలికాం రంగం భారీగా 40వేల ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలలు ఇదే ట్రెండ్‌ కొనసాగి, మొత్తంగా 80వేల నుంచి 90వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ రిపోర్టు పేర్కొంది. ఈ రిపోర్టుల నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో టెలికాం రంగం భారీగా ఉద్యోగవకాశాలు కల్పించనుందని తెలియడం నిరుద్యోగులకు గుడ్‌న్యూసేనని ఇండస్ట్రి వర్గాలంటున్నాయి. 

వచ్చే ఐదేళ్లలో క్రియేట్‌ కాబోయే ఉద్యోగాల్లో ఎక్కువగా డిమాండ్‌ మిషన్‌ టూ మిషన్‌ కమ్యూనికేషన్స్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీలో ఉండనుంది. అనంతరం టెలికాం తయారీ, మౌలిక సదుపాయాలు, సర్వీసెస్‌ కంపెనీల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉండనున్నట్టు కొచ్చర్‌ చెప్పారు. ఎక్కువ తయారీ ప్రక్రియ భారత్‌కు వచ్చే సూచనలు ఉన్నాయని, దీంతో టెలికాం రంగం ఎక్కువ అవకాశాలను సృష్టించనుందని తెలిపారు. ట్రైనింగ్‌ అనంతరం కల్పించే ఉద్యోగవకాశాల్లో ప్రభుత్వం తన విధానం మార్చుకోవాలని టెలికాం సెక్టార్‌ స్కిల్‌ బాడీ ప్రతిపాదించింది. ఒకవేళ వర్క్‌ఫోర్స్‌ ఎక్కువ స్కిల్‌తో ఉంటే, టెలికాం సెక్టార్‌ అట్రిక్షన్‌ విషయంలో భయపడాల్సి ఉంటుందని కొచ్చర్‌ అన్నారు. ఆ భయాందోళనలను తగ్గించడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.   

మరిన్ని వార్తలు