లాభాల మోత మోగిస్తున్న టెలికాం షేర్లు

20 Jul, 2020 13:25 IST|Sakshi

13శాతం పెరిగిన లాభపడి వోడాఫోన్‌ ఐడియా 

1.50శాతం ర్యాలీ చేసిన భారతీ ఎయిర్‌టెల్‌

టెలికాం రంగ షేర్లు సోమవారం లాభాల మోత మోగిస్తున్నాయి. ఈ రంగానికి చెందిన వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, ఎంటీఎన్‌ఎల్‌, టాటా సర్వీసెస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 13శాతం వరకు లాభపడ్డాయి. అత్యధికంగా వోడాఫోన్‌ ఐడియా షేరు 13శాతం ర్యాలీ చేసింది.  ఏజీఆర్‌ బకాయిల కింద టెలికాం విభాగానికి శుక్రవారం మరో రూ.1000 కోట్లు చెల్లించడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు నేటి మధ్యాహ్నం 2గంటలకు సుప్రీం కోర్టులో ఏజీఆర్‌ అంశంపై విచారణ జరగనుంది. ఏజీఆర్‌ బకాయిలు చెల్లింపునకు టెలికాం సంస్థలు 10ఏళ్లలో గడువు కోరిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆస్తకి నెలకొంది. 

ఏజీఆర్‌ కేసుపై జూలై 18న సుప్రీం కోర్టు మాట్లాడుతూ ... వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌తో సహా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తప్పనిసరిగా "సహేతుకమైన చెల్లింపు ప్రణాళిక"ను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. అలాగే బోన్‌ఫైడ్‌ కొరకు కొంత మొత్తంలో చెల్లింపు చేయాలని అలాగే గత పదేళ్లకు సంబంధించిన ఖాతా బుక్స్‌లను ఫైల్‌ చేయాల్సిందిగా టెలికాం కంపెనీలను ఆదేశించింది. 

రూ.1000 కోట్లు చెల్లించిన వోడాఫోన్‌: 
సవరించిన స్థూల ఆదాయం బకాయి కింద మరో రూ.1000 కోట్లు చెల్లించినట్లు టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తాన్ని టెలికాం విభాగానికి జమ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత చెల్లింపుతో ఇప్పటి వరకు ఏజీఆర్‌ బకాయి కింద మొత్తం రూ.7854 కోట్లు చెల్లించినట్లు కంపెనీ తెలిపింది. ఇది వరకు  ఏజీఆర్‌ బకాయి కింద 3విడుతల్లో మొత్తం రూ.6584 కోట్ల చెల్లించినటన్లు వోడాఫోన్‌ పేర్కోంది. ఏజీఆర్‌ బకాయిల అంశంపై గతనెల జరిగిన విచారణ సందర్భంగా తదుపరి విచారణ నాటికి కొంతమొత్తం చెల్లించాలని సుప్రీం కోర్టు టెలికాం కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని వొడాఫోన్‌ ఐడియా జమ చేసింది. ఏజీఆర్‌ బకాయి కింద రూ.58 వేల కోట్లు వొడాపోన్ ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు