టెలికం యూజర్లు107.4 కోట్లు

12 Dec, 2016 14:30 IST|Sakshi
టెలికం యూజర్లు107.4 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలో టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య సెప్టెంబర్ నెల చివరి నాటికి 107.4 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య ఆగస్ట్ నెలాఖరుకి 105.3 కోట్లుగా ఉంది. అంటే నెలవారి వృద్ధి 1.98%. పట్ణణ ప్రాంత సబ్‌స్క్రిప్షన్ 60.64 కోట్ల నుంచి 62.43 కోట్లకు పెరిగింది. గ్రామీణ ప్రాంత సబ్‌స్క్రిప్షన్ 44.69 కోట్ల నుంచి 44.98 కోట్లకు ఎగసింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాలను పేర్కొంటున్నారుు. వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.03 శాతం వృద్ధితో 102.8 కోట్ల నుంచి 104.9 కోట్లకు పెరిగింది. వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.45 కోట్ల నుంచి 2.44 కోట్లకు తగ్గింది. సెప్టెంబర్‌లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి మొత్తంగా 50 లక్షల విజ్ఞప్తులు వచ్చారుు.

మరిన్ని వార్తలు