అయిదేళ్లలో 10 వేల ఉద్యోగాలు

30 Apr, 2018 00:03 IST|Sakshi

గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రెసిడెంట్‌ నాగ సత్యం  

హైదరాబాద్‌: వచ్చే అయిదేళ్లలో 8–10 వేల మందికి ఉద్యోగావకాశాలు అందించనున్నట్టు ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీ సంస్థ గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ వెల్లడించింది. భారత్‌ను ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని కంపెనీ స్ట్రాటజీ ప్రెసిడెంట్‌ నాగ సత్యం తెలిపారు. శ్రీలంక, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్‌కు ఇక్కడి నుంచి బస్‌లను సరఫరా చేయనున్నట్టు చెప్పారు. త్వరలోనే విదేశీ గడ్డమీద అడుగు పెట్టనున్నాయని వివరించారు. ఎగుమతుల విషయంలో భారత్‌ నుంచి తొలి ఎలక్ట్రిక్‌ బస్‌ కంపెనీగా నిలుస్తామన్నారు.

చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్‌ బస్‌లను గోల్డ్‌స్టోన్‌ తయారు చేస్తోంది. హైదరాబాద్‌ సమీపంలో కంపెనీకి అసెంబ్లింగ్‌ ప్లాంటు ఉంది. ఏడాదికి 600 బస్‌లను సరఫరా చేసే సామర్థ్యం ఈ యూనిట్‌కు ప్రత్యేకత. ఏడాదికి 1,500 బస్‌లను అసెంబుల్‌ చేయగల సామర్థ్యంతో కర్ణాటకలో రూ.600 కోట్లతో నిర్మిస్తున్న ప్లాంటు 2018 అక్టోబరు కల్లా సిద్ధం కానుంది. తెలంగాణకు 100, బెంగళూరుకు 150, ముంబైకి 40 బస్‌లను సరఫరా చేసేందుకై ఆర్డర్లను ఇటీవలే గోల్డ్‌స్టోన్‌ సాధించింది.    

మరిన్ని వార్తలు