నోట్ల రద్దుతో లభించిన ప్రయోజనాలివే...

8 Nov, 2017 08:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ''యాంటీ బ్లాక్‌ మనీ డే'' గా డీమానిటైజేషన్‌ వార్షికోత్సవం నిర్వహిస్తోంది. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా నిర్ణాయక యుద్ధంలో పోరాడి 125 కోట్ల మంది భారతీయులు విజయం సాధించినట్టు కూడా ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో సాధించిన విజయాలను ప్రభుత్వం వివరించింది. అవేమిటో ఓసారి చూద్దాం...

భారత దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా అత్యధికంగా నల్లధనం వెలికితీయబడింది.
భారతదేశ జనాభాలోని 0.00011% మంది దేశంలోని మొత్తం నగదులో దాదాపుగా 33% డిపాజిట్‌ చేశారు. 
17.73 లక్షల కేసులలో నగదు లావాదేవీలు పన్ను ప్రొఫైల్‌తో సరిపోల్చబడలేదు.
23.22 లక్షల ఖాతాలలో రూ.3.68 లక్షల కోట్ల నగదు డిపాజిట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి.
అధిక డినామినేషన్‌ నోట్లు సుమారుగా రూ.6 లక్షల కోట్లకు తగ్గించబడినవి.

ఉగ్రవాదానికి, నక్సలిజానికి నిర్ణాయకమైన ఎదురుదెబ్బ
కాశ్మీరులో రాళ్ళు రువ్వే సంఘటనలు 75 శాతానికి పైగా తగ్గాయి.
వామపక్ష తీవ్రవాద సంఘటనలు 20 శాతానికి పైగా తగ్గాయి.
7.62 లక్షల దొంగనోట్లు కనుగొనబడినవి.

భారతదేశపు ఆర్థిక వ్యవస్థ విస్తృత ప్రక్షాళన
నల్లధనం, హవాలా వ్యవహారాలు నిర్వహించే షెల్‌ కంపెనీల గుట్టు బయట పెట్టడం జరిగింది.
షెల్‌ కంపెనీలపై సర్జికల్‌ దాడులలో 2.24 లక్షల కంపెనీలు మూసివేశారు.
35వేల కంపెనీలకు చెందిన 58వేల బ్యాంకు ఖాతాలు నోట్ల రద్దు తర్వాత రూ.17వేల కోట్ల లావాదేవీలు జప్తు చేయబడినవి.

నిర్ధిష్ట రూపకల్పన వలన అధిక అభివృద్ధి, పేదలకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు
కార్మికుల బ్యాంకు ఖాతాలలోకి జీతం నేరుగా బదిలీ
1.01 కోట్ల మంది ఉద్యోగులు ఈపీఎఫ్‌లో చేర్చబడ్డారు.
1.3 కోట్ల మంది కార్మికులు ఈఎస్‌ఐసీ వద్ద నమోదు చేసుకున్నారు. దీని ద్వారా సామాజిక భద్రత, ఆరోగ్య ప్రయోజనాలు చేకూరనున్నాయి. 

నోట్ల రద్దు కారణంగా పన్ను అమలులో అనూహ్యమైన పెంపుదల
కొత్త పన్ను చెల్లింపుదార్లు 2015-16లో 66.53 లక్షల నుంచి 2016-17లో 84.21 లక్షలకు 26.6 శాతం మేరకు పెరిగారు.
దాఖలు చేసిన ఇ-రిటర్నుల సంఖ్య 2016-17లో 2.35 కోట్ల నుంచి 2017-18లో 3.01 కోట్లకు 27.95 శాతం పెరిగాయి.
తక్కువ నగదు ఉపయోగించే విధానానికి మారడం ద్వారా దేశంలో స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థ
2016 ఆగస్టులో డిజిటల్‌ లావాదేవీలు 87 కోట్లు ఉండగా.. 2017 ఆగస్టులో 138 కోట్లకు పెరిగాయి. ఇది 58 శాతం వృద్ధి.
నోట్ల రద్దు వరకు మొత్తం 15.11 లక్షల పీఓఎస్‌ మెషిన్లు ఉండగా.. కేవలం 1 సంవత్సరంలో 13 లక్షలకు పైగా పీఓఎస్‌ మెషిన్లు చేర్చబడినవి.
నోట్ల రద్దు కారణంగా ప్రజల రుణాలకు వడ్డీరేటు తగ్గింపు, రియల్‌ ఎస్టేట్‌ ధరలలో తగ్గుదల పట్టణ స్థానిక సంస్థల ఆదాయం పెరుగుదల వంటి బహుళ ప్రయోజనాలను పొందారు. 

మరిన్ని వార్తలు