అత్యంత ఖరీదైన బ్రాండ్లు ఏంటో తెలుసా..?

11 Jun, 2016 10:06 IST|Sakshi
అత్యంత ఖరీదైన బ్రాండ్లు ఏంటో తెలుసా..?

టెక్ దిగ్గజం యాపిల్ ను అధిగమించి, ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్ గా సెర్చ్ ఇంజన్ గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది. బ్రాండ్ కన్సల్టెన్సీ మిల్వార్ట్ బ్రౌన్ వార్షిక ర్యాంకింగ్స్ లో గూగుల్ తన హవా చాటుకుంది. 30లక్షల కన్సూమర్ల ఇంటర్వ్యూలు, ప్రతీ కంపెనీ ఫైనాన్సియల్ డేటా, బిజినెస్ ఫర్ ఫార్మెన్స్ తో ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ ల ర్యాంకింగ్ లను మిల్వార్డ్ బ్రౌన్ వెల్లడించింది. ఈ బ్రాండింగ్ సంస్థ విడుదల చేసిన ర్యాకింగ్ లో టాప్-5 లో నిలిచిన కంపెనీల గురించి మనం ఓ సారి తెలుసుకుందాం...


1. గూగుల్....
బ్రాండ్ విలువ : 22,920 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +32శాతం
గతేడాది ర్యాంకు :  2
కొంగొత్త ఆవిష్కరణలతో గూగుల్ మార్కెట్లో దూసుకెళ్తోంది. అధిక మొత్తంలో వ్యాపార ప్రకటనలతో తన రాబడులను పెంచుకుంది. క్లౌడ్ బిజినెస్ లో తన వృద్ది ఎక్కువగా ఉందని, పనిలో చాలా పారదర్శకతగా గూగుల్ వ్యవహరిస్తుందని మిల్వార్డ్ బ్రౌన్ చెప్పింది.

2. యాపిల్....
బ్రాండ్ విలువ : 22,850 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : -8శాతం
గతేడాది ర్యాంకు : 1
యాపిల్ ఈ ఏడాది ఆవిష్కరించిన కొత్త ప్రొడక్ట్ ల ఫర్ ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బ్రాండ్ విలువకు దెబ్బకొట్టింది. యాపిల్ వాచ్ ను ఏప్రిల్ లో లాంచ్ చేశారు. కానీ అది అంతగా వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రత్యర్థి కంపెనీ స్మార్ట్ ఫోన్ల కంపెనీల కంటే యాపిల్ స్మార్ట్ వాచ్ అమ్మకాలే ఎక్కువ నమోదు అయ్యాయి. కేవలం గాడ్జెట్ లు మాత్రమే కాక, తాను సర్వీసులను కూడా అందించగలదని, చైనాలో అతిపెద్ద రవాణా సంస్థ దిదీ చుక్సింగ్ లో పెట్టుబడులు పెట్టి నిరూపించింది.

3.మైక్రోసాప్ట్....
బ్రాండ్ విలువ : 12,180 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +5శాతం
గతేడాది ర్యాంకు : 3
బిజినెస్ టూ బిజినెస్ బ్రాండ్ లో మైక్రోసాప్ట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలుస్తోంది. కమర్షియల్ క్లౌడ్ బిజినెస్ లో మైక్రోసాప్ట్  దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2700లక్షల డివైజ్ లలో విండోస్ 10 యాక్టివ్ లో ఉంది.

4. ఏటీ అండ్ టీ...
బ్రాండ్ విలువ.. 10,740 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +20శాతం
గతేడాది ర్యాంకు : 6
టాప్-10 నిలిచిన ఈ కంపెనీ, రెండో టెలికాం కంపెనీగా పేరుతెచ్చుకుంటోంది. క్వాడ్ ప్లే వల్ల ఏటీ అండ్ టీ తన ప్రత్యర్థుల కంటే ఎక్కువగా ఫర్ ఫార్మ్ చేస్తుందని మిల్వార్డ్ బ్రౌన్ తెలిపింది. ఏటీ అండ్ టీ కారు తయారీ దారులు ఫోర్డ్, బీఎమ్ డబ్ల్యూ, టెస్లాలతో దోస్తి కుదుర్చుకుని, అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలుస్తోంది.

5. ఫేస్ బుక్...
బ్రాండ్ విలువ : 10,260 కోట్ల డాలర్లు
గతేడాది నుంచి వచ్చిన శాతంలో మార్పు : +44 శాతం
గతేడాది ర్యాంకు : 12
ఫేస్ బుక్ 2015 ఏడాదిలో రెవెన్యూల్లో దూసుకెళ్లి, బలమైన ఆర్థిక ప్రదర్శనను చూపిండటంతో, తన ర్యాంకును మెరుగుపరుచుకోగలిగింది. వర్చువల్ రియాల్టీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా దృష్టిసారిస్తూ లాంగ్ టర్మ్ విజన్ ఏర్పాటుచేసుకుంది. మీడియా ప్లాట్ ఫామ్ లోకి తన వర్క్ ను మరల్చుకుంటూ, ఒరిజినల్ కంటెంట్ ను పబ్లిషర్లు ఫేస్ బుక్ పై పోస్టు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఎక్కువగా వీడియోల ద్వారా వార్తల వారధిగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు