అద్దాలతో అందం

7 Jun, 2014 01:44 IST|Sakshi
అద్దాలతో అందం

హైదరాబాద్:  నగరంలో ఆకాశాన్నంటే అద్దాల మేడల నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. మార్కెట్‌లో వస్తున్న మార్పులు, అవసరాల ఆధారంగా వీటి జోరు పెరుగుతోంది. కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం కాలుష్యం కారణంగా వెలవెలబోతే ప్రయోజనం ఉండదు. కాలుష్యంతో భవనాల గోడలే కాదు, అందులో ఉండే వారి ఆరోగ్యం కూడా పాడవుతోంది. అందుకే భవనాలకు రక్షణ కవచం (ఫ్రంట్ ఎలివేటర్) అవసరమంటున్నారు నిపుణులు.

మేలిమి ముసుగును తలపించే రీతిలో అద్దాలతో నిర్మించిన ఫ్రంట్ ఎలివేటర్స్, ఫైబర్, ప్లాస్టిక్‌ను ఉపయోగించి నిర్మించిన ఫ్రంట్ ఎలివేషన్ భవనానికి కొత్త అందానిస్తాయి. నగరంలో రోడ్డుకిరువైపులా కొలువుదీరిన భవనాలన్నీ ఇలా ముస్తాబవుతున్నవే. అపార్ట్‌మెంట్‌ల నుంచి కార్పొరేట్ కార్యాలయాల వరకు ఫ్రంట్ ఎలివేషన్‌తో ముస్తాబై శోభాయమానంగా నిలుస్తున్నాయి.

 ఎలివేషన్‌తో: రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలకు కాలుష్యం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భవనాల లోపలి  గోడలు, వస్తువులు, ఫైళ్లపై దుమ్ము పేరుకుపోతుంది. పుస్తకాలు, ఫైళ్లు నల్లగా రంగు మారతాయి. దీని నుంచి బయటపడాలంటే భవనానికి రోడ్డువైపు ఫ్రంట్ ఎలివేషన్ చేయించాలి. వెంటిలేషన్ కోసం భవనం వెనుక వైపు కిటికీలను, విండోలను ఓపెన్ చేయాలి. వెనుక, ఇరుపక్కల ప్రంట్ ఎలివేషన్ చేయించినా వెంటిలేషన్ కోసం ఓపెన్ చేసేందుకు వీలుగా నిర్మించుకుంటే మంచిది.

 అద్దాలే బెటర్: వెంటిలేషన్‌కు ఫైబర్, ప్లాస్టిక్ కన్నా అద్దాలు ఉపయోగిస్తే మంచిది. ఎందుకంటే పగలు వెలుతురు ప్రసరించడం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. అద్దాలు పగలకుండా నెట్ (వల) అమర్చుకోవచ్చు. కొన్ని భవనాలకు చుట్టూ గోడలు నిర్మించకుండా ఎలివేషన్ చేయిస్తున్నారు. ఇందువల్ల ఖర్చు తగ్గుతుంది. భవనం ఫిల్లర్స్‌పై బరుకు కూడా తగ్గుతుంది. ఎలివేషన్ కారిడార్‌లో వర్షం పడకుండా నిరోధిస్తుంది. గాలి వానల సమయంలో ఏ ఇబ్బంది ఉండదు.

మరిన్ని వార్తలు