‘వన్నాక్రై’ పై సెర్ట్‌–ఇన్‌ సూచనలు పాటించండి

16 May, 2017 01:15 IST|Sakshi
‘వన్నాక్రై’ పై సెర్ట్‌–ఇన్‌ సూచనలు పాటించండి

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ నెట్‌వర్క్‌లను అస్తవ్యస్తం చేస్తున్న రాన్సమ్‌వేర్‌ ’వన్నాక్రై’ దాడుల బారిన పడకుండా ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సెర్ట్‌–ఇన్‌) సూచనలు పాటించాలంటూ బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. అలాగే తమ తమ సిస్టమ్స్‌పై వైరస్‌ దాడులు జరగకుండా ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్‌డేట్‌ చేసి ఉంచాలని సూచించింది.

 రష్యా, బ్రిటన్‌ సహా 150 పైగా దేశాల్లోని ఐటీ నెట్‌వర్క్‌లను వన్నాక్రై దెబ్బతీసింది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ఎక్స్‌పీ వంటి పాత తరం ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌పై పనిచేస్తున్న కంప్యూటర్లు దీని బారిన పడ్డాయి. దీంతో.. రాన్సమ్‌వేర్‌ దాడుల నుంచి నెట్‌వర్క్‌లను రక్షించుకునేందుకు దేశీయంగా సంస్థలు తీసుకోతగిన చర్యల జాబితాను సెర్ట్‌–ఇన్‌ రూపొందించిన సంగతి తెలిసిందే.

రిజర్వ్‌ బ్యాంక్‌లో సీఎఫ్‌వో పోస్టు..: ఆర్‌బీఐ తొలిసారిగా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌వో) పోస్టును ఏర్పాటు చేసింది. ఇందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈడీ హోదా ఉండే సీఎఫ్‌వో.. అకౌంటింగ్‌ విధానాల రూపకల్పన, ఆర్‌బీఐ ఆర్థిక సమాచారం తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

>
మరిన్ని వార్తలు