జియో మీట్ : మిలియ‌న్ దాటిన డౌన్‌లోడ్స్

6 Jul, 2020 13:16 IST|Sakshi

ముంబై: రిల‌య‌న్స్ జియో ఇటీవ‌ల ఆవిష్కరించిన వీడియో కాలింగ్ యాప్ జియో మీట్‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. యాప్ లాంఛ్ అయిన మూడురోజుల్లోనే 10 ల‌క్ష‌ల‌మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. చైనాతో స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్‌ల‌పై కేంద్రం నిషేదం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్వ‌దేశీ యాప్‌ల‌కు భారీ డిమాండ్ నెల‌కొంది. అయితే వీడియో కాలింగ్ స‌ర్వీస్‌తో కూడిన యాప్‌ను లాంచ్‌ చేస్తామ‌ని గ‌త ఏప్రిల్‌లోనే జియా రిల‌య‌న్స్ కంపెనీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. (రిలయన్స్ జియోలో ఇంటెల్‌- జియోమీట్‌ యాప్‌)

జియో మీట్ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్ ఐఓఎస్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 720పీ వీడియో క్వాలిటీతో పాటు 100 మంది ఒకేసారి ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొనే అవ‌కాశం ఉండ‌టం దీని ప్ర‌త్యేక‌త‌. జూమ్ యాప్‌కి ధీటుగా వ‌చ్చిన జియో మీట్‌కి ఇప్ప‌టికే భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ‘వినియోగదారుల స‌మాచారం భ‌ద్రంగా ఉంటుంది. మీ గోప్య‌త‌కు భంగం వాటిల్ల‌నివ్వం. పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ప‌నిచేస్తాం’ అంటూ జియా మీట్ వెబ్‌సైట్‌లో ప్ర‌త్యేకంగా రాసుకొచ్చారు. ఒక‌వేళ దీనికి సంబంధించి ఏమైనా సందేహాలున్నా మీ అభిప్రాయాల‌ను grievance.officer@jio.comకు పంపాల్సిందిగా కోరింది. (జియోలో మరో భారీ పెట్టుబడి)


 

మరిన్ని వార్తలు