థామస్ కుక్ నుంచి తొలి ఫారెక్స్ యాప్

10 Nov, 2015 02:07 IST|Sakshi
థామస్ కుక్ నుంచి తొలి ఫారెక్స్ యాప్

ముంబై: విదేశీ మారక లావాదేవీలన్నీ ఒకే చోట నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తూ భారత్‌లో తొలిసారిగా ‘ఫారిన్ ఎక్స్చేంజ్ యాప్’ను ప్రవేశపెట్టినట్లు థామస్ కుక్ (ఇండియా) తెలిపింది. ఇందులో డాలర్, యూరో, ఫ్రాంక్ తదితర ప్రధాన కరెన్సీల మారక విలువలు ఎప్పటికప్పుడు పొందుపర్చడం జరుగుతుందని వివరించింది. రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల నష్టపోకుండా ఉండేందుకు ‘బ్లాక్ మై రేట్’ ఆప్షన్ కూడా ఈ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో ఉంటుందని థామస్ కుక్ (ఇండియా) సీవోవో అమిత్ మదన్ తెలిపారు. అలాగే, నిర్దిష్ట కరెన్సీల మారకం విలువలకు సంబంధించి ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా రేట్ అలర్టులు కూడా పొందవచ్చని వివరించారు.
 

>
మరిన్ని వార్తలు