జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌కు అనుమతి

12 Sep, 2016 01:13 IST|Sakshi
జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌కు అనుమతి

ఐఆర్‌బీ, ఎంఈపీ ఐఎన్‌విట్‌లకూ సెబీ గ్రీన్ సిగ్నల్
ముంబై: మౌలికరంగ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఐఎన్‌విట్)లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసి రెండేళ్లు గడిచిన తర్వాత ఒకేసారి మూడు సంస్థలు ఐఎన్‌విట్‌ల ఏర్పాటుకు సెబీ అనుమతి పొందాయి. తొలిగా ఐఆర్‌బీ ఐఎన్‌విట్‌కు సెబీ అనుమతి జారీ చేయగా, ఆ వెంటనే జీఎంఆర్, ఎంఈపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు సైతం అనుమతి మంజూరు చేసింది. దీంతో ఇవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐఎన్‌విట్‌ల ఏర్పాటు ద్వారా ఐపీవో మార్గంలో నిధులు సమీకరించడంతోపాటు ఎక్స్ఛేంజ్‌లలో లిస్ట్ అవుతాయి. ఇప్పటికే ఐఆర్‌బీ ఐఎన్‌విట్ రూ.4,300 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించిన ఐపీవో దరఖాస్తు పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది.

ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లనేవి మ్యూచువల్ ఫండ్స్‌లా పనిచేస్తాయి. వీటిల్లో రిటైల్, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ ప్రాజెక్టులపై వచ్చే లాభాలను సొంతం చేసుకోవచ్చు.  కంపెనీలు ప్రాజెక్టులపై నిధులను పొందడానికి వీలు కల్పిస్తాయి. ఐఎన్‌విట్, ఆర్‌ఈఐటీల మార్గదర్శకాలను సెబీ 2014 ఆగస్ట్‌లో జారీ చేసింది. పన్ను పరమైన అంశాలతో ఒక్క కంపెనీ ముందుకు రాలేదు. దీంతో మార్గదర్శకాలను సరళతరం చేయనున్నట్టు సెబీ ఇటీవలే ప్రకటించింది.

మరిన్ని వార్తలు