హ్యుందాయ్‌ కంపెనీలో ముగ్గురికి కరోనా..

24 May, 2020 19:27 IST|Sakshi

ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియాలో కరోనా కలకలం రేగింది. రెండు నెలల లాక్‌డౌన్‌ అనంతరం కార్యకలాపాలను ప్రారంభించిన నేపథ్యంలో ఇండియన్‌ ప్లాంట్‌లో పనిచేసే ముగ్గురు కార్మికులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపింది. కరోనా బారిన పడిన కార్మికులు ప్రస్తుతం సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని కంపెనీ ప్రతనిధులు తెలిపారు. వారికి మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. కోవిడ్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం ఆదేశించిన నియమాలను పాటిస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

కాగా, మరో పదహారు మంది కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించామని.. వారి ఫలితాలు రెండు మూడు రోజులలో రావచ్చని ప్రభుత్వ సీనియర్‌ ఉన్నతాధికారి ఓ సంస్థకు తెలిపారు. కాగా పరిశ్రమల వృద్ధిని ఆపడం ప్రభుత్వ విధానం కాదని.. కానీ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారి పి.పొన్నయ్య తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల ఆటోమొబైల్‌ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని.. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.‍

మరిన్ని వార్తలు