ఆటోమేషన్‌తో ఊడే ఉద్యోగాలివే..

8 Feb, 2018 10:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమేషన్‌ రాకతో లక్షలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళనల నేపథ్యంలో రానున్న రెండు దశాబ్ధాల్లో ఏయే రంగాల్లో, ఏయే దేశాల్లో ఎక్కువగా కొలువులు కోల్పోతాయనే వివరాలను పీడబ్ల్యూసీ అథ్యయనం వెల్లడించింది. ఆటోమేషన్‌ ప్రభావాన్ని భిన్న కోణాల్లో ఈ అథ్యయనం విశ్లేషించింది. 2030 నాటికి ఆటోమేషన్‌ కారణంగా డ్రైవర్‌ రహిత వాహనాలు ముంచెత్తే క్రమంలో రవాణా, తయారీ రంగాలు అత్యధికంగా ప్రభావితమవుతాయని, పెద్దసంఖ్యలో ఉద్యోగాలు దెబ్బతింటాయని లెక్కగట్టింది. ఫైనాన్షియల్‌ సర్వీసుల రంగంలో మానవవనరులకు డిమాండ్‌ తగ్గుతుందని పేర్కొంది.

డేటా అనాలిసిస్‌, అలాగరిథమ్స్‌ కారణంగా కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందని పసిగట్టింది. ఐటీ, నిర్మాణ రంగాల్లోనూ ఆటోమేషన్‌ రిస్క్‌ అధికంగా ఉందని పేర్కొంది. అయితే విద్య, వైద్య రంగాల్లో ఆటోమేషన్‌ ప్రభావం పెద్దగా ఉండబోదని తెలిసింది. ఆటోమేషన్‌ ముప్పు తప్పించుకోవాలంటే అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవాలని స్పష్టం చేసింది. సరైన విద్యార్హతలు లేనివారు దీర్ఘకాలంలో రిస్క్‌ ఎదుర్కొంటారని హెచ్చరించింది. క్లరికల్‌ ఉద్యోగాలు చేపట్టే మహిళల ఉద్యోగాలు ఆటోమేషన్‌ కారణంగా ముప్పును ఎదుర్కొంటాయని తెలిపింది. 

మరిన్ని వార్తలు