బీఓబీ, దేనా, విజయా బ్యాంకుల విలీనం..

24 Dec, 2018 05:07 IST|Sakshi

నెలాఖరుకు స్కీము ఖరారు..

ముంబై: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంక్‌ల విలీన ప్రక్రియకు సంబంధించిన స్కీమ్‌ ఈ నెలాఖరు కల్లా ఖరారు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందు కూడా దీన్ని ఉంచే అవకాశం ఉందని వివరించాయి. జనవరి 8 దాకా ఈ సమావేశాలు జరగనున్నాయి. స్కీమ్‌పై ప్రస్తుతం కసరత్తు జరుగుతుండగా, తర్వాత మూడు బ్యాంకుల బోర్డులు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రమోటరు సమకూర్చాల్సిన అదనపు మూలధనం వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విలీన బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కాగలవని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో విలీన బ్యాంకు దేశీయంగా ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ల తర్వాత మూడో స్థానంలో ఉండనుంది.

మరిన్ని వార్తలు