భారత్‌లో టాక్‌టాక్‌ మాతృసంస్థ పెట్టుబడులు

1 Jun, 2020 17:43 IST|Sakshi

న్యూఢిల్లీ: వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం టిక్‌టాక్మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌ భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించింది. చైనాకు చెందిన దిగ్గజ కంపెనీ ఆసియాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం చైనాలో అత్యధిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న బైట్‌ డ్యాన్స్ రెండో దేశంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించాలని యోచిస్తుంది. బైట్‌ డ్యాన్స్‌ అభివృద్ధికి కావాల్సిన ఐటీ సాంకేతికతను త్వరలోనే రూపొందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. సంస్థ రూపొందించే నూతన సాంకేతికత కంటెంట్‌కు సంబంధించిన  అన్ని అంశాలను విశ్లేషిస్తుందని తెలిపారు. తాజా సంస్కరణలకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో బైట్‌ డ్యాన్స్‌ ఇండియా సర్విసెస్‌ లిమిటెడ్‌ పేరుతో కొనసాగుతుంది. భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించేందుకు సరికొత్త డాటా, టెక్నాలజీని రూపొందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. టిక్‌టాక్‌ను ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లేలో డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సెన్సార్‌ స్టోర్‌ ఇంటలిజన్స్‌ అనే సంస్థ నివేదిక వెల్లడించింది. అమెరికన్‌ టీనజర్లను డ్యాన్స్‌ వీడియోలతో బైట్‌ డ్యాన్స్‌ విశేషంగా అలరిస్తోందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూజర్లకు సరికొత్త గేమ్స్‌, మ్యూజిక్‌ను ప్రవేశపెడుతూ యూజర్లు క్లిక్‌ చేసేలా బైట్‌ డ్యాన్స్ వ్యూహాలు రచిస్తోంది. కాగా గత కాలంగా కరోనా వైరస్‌కు చైనా కారణమనే ఊహాగానాల వల్ల మార్చి, ఏప్రిల్‌లో టిక్‌టాక్‌ ఫాలోవర్స్‌  కొంత తగ్గినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: 4.7 రేటింగ్‌తో దూసుకుపోతున్న మిట్రాన్‌

మరిన్ని వార్తలు