సంపాదనలో టిక్‌టాక్‌ ఓనర్ దూకుడు

21 May, 2020 19:18 IST|Sakshi

ముంబై: ప్రపంచ వ్యాప్తంగా చైనీస్‌ యాప్‌ టిక్‌టాక్‌ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టిక్‌ టాక్‌ వ్యవస్థాపకుడు జాంగ్‌ ఇమింగ్‌ సంపద 10కోట్ల డాలర్‌లు దాటినట్లు ఓ నివేదిక వెల్లడించింది. వ్యక్తి అభిరుచులను ప్రదర్శించేందుకు టిక్‌టాక్‌ను అందరు సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్త స్టార్ట్‌ప్‌లో తనదైన ముద్ర వేసుకొని టిక్‌టాక్ తన విజయప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. షేర్ మార్కెట్‌లో కూడా టిక్‌టాక్‌ తన ప్రభంజనాన్ని అప్రతిహాతంగా కొనసాగిస్తుంది. టిక్‌టాక్‌ ప్రారంభంలో అమెరికన్‌ టీనెజర్లను విశేషంగా అలరించింది.

ప్రస్తుతం టిక్‌టాక్‌ ట్విటర్‌తో సమానంగా పోటీపడుతుండగా.. ఫేస్‌బుక్‌తో పోటీలో మాత్రం కొంత వెనుకంజలో ఉందని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టిక్‌టాక్‌లో డ్యాన్సింగ్‌, మ్యూజిక్‌ వీడియోలు, హావభావాలు ప్రదర్శించేందుకు యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వేగంగా యువతను ఆకర్శించే విధంగా టిక్‌టాక్ నవీన వ్యూహాలు రచిస్తున్నట్లు కంపెనీకి చెందిన ప్రతినిథులు తెలిపారు. టిక్‌టాక్‌ తదుపరి లక్ష్యంగా చైనీస్‌ ఇంటర్నెట్‌ దిగ్గజం ఆలీబాబాను ఢీకొట్టడానికి ప్రణాళిక రచిసున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

చదవండి: పాతాళంలోకి జారిపోతున్న టిక్‌టాక్ రేటింగ్‌

మరిన్ని వార్తలు