టైటన్‌ లాభాలు 67శాతం జంప్‌

3 Nov, 2017 18:52 IST|Sakshi

సాక్షి,ముంబై:  టైటాన్ కంపెనీ లిమిటెడ్ లాభాల్లో  మరోసారి అదరగొట్టింది.  శుక్రవారం ప్రకటించిన ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో  భారీ లాభాలను నమోదు చేసింది.    ముఖ్యంగా బంగారం వ్యాపారంలో అత్యధిక లాభాలను సాధించి విశ్లేషకుల అంచనాలను బీట్‌ చేసింది. సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ త్రైమాసికంలో  నికరలాభం 67.44 శాతం  ఎగిసి రూ .277.93 కోట్లను సాధించింది.  గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ .165.98 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. టైటాన్ మొత్తం ఆదాయం 3,517.7 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .2,714.98 కోట్లు ఆర్జించింది. 
జ్యుయల్లరీ సెగ్మెంట్  లాభాలు మొత్తం ఆదాయంలో 79 శాతం పుంజుకుంది. 37 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 2,748.20 కోట్లను సాధించింది. క్వార్టర్ ప్రారంభంలో కొత్త పిఎంఎల్ఏ నిబంధనల ద్వారా జ్యూయలరీ వ్యాపారాన్ని ప్రభావితం చేసినా  పండుగ సీజన్ వ్యాపారానికి ఊపందుకుందని టైటన్‌ మేనేజింగ్ డైరెక్టర్   భాస్కర్ భట్ చెప్పారు.

ద్వితీయ త్రైమాసికంలో టైటాన్ వాచ్‌ ల ద్వారా ఆదాయం 8.96 శాతం పెరిగి రూ .571.75 కోట్లకు చేరుకుంది. ఆభరణాల వ్యాపార ఆదాయం 36.90 శాతం పెరిగి రూ .2,748.2 కోట్లకు చేరింది.  ఐ వేర్‌ విభాగంలో వచ్చిన ఆదాయం 3.51 శాతం పెరిగి రూ .98.54 కోట్లకు చేరింది.  కాగా శుక్రవారం నాటి మార్కెట్‌లో టైటాన్ ఇండస్ట్రీస్ షేర్లు 0.56 శాతం పెరిగి రూ .659.40 వద్ద స్థిరపడింది.

 

మరిన్ని వార్తలు