లాభాల మార్కెట్లోనూ.. ఏడాది కనిష్టానికి 44 షేర్లు

20 May, 2020 14:02 IST|Sakshi

52 వారాల కనిష్ట,గరిష్టాలకు చేరిన షేర్లు 

 దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అయినప్పటికీ ఎన్‌ఎస్‌ఈలో 44 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. కనిష్టానికి పతనమైన షేర్లలో ఏబీబీ ఇండియా, ఆసియన్‌ హోటల్స్‌(వెస్ట్‌), రాజదర్శన్‌ ఇండస్ట్రీస్‌, అరిహంత్‌ సూపర్‌స్ట్రక్చర్స్‌, అరవింద్‌ ఫ్యాషన్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌, ఛాలెట్‌ హోటల్స్‌, చోళమండళం ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌, గ్రీన్‌ప్యానెల్‌ ఇండస్ట్రీస్‌, జీటీఎన్‌ టెక్స్‌టైల్స్‌, హవెల్స్‌ ఇండియా, హోటల్‌ రగ్బీ, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌, ఇండో థాయ్‌ సెక్యూరిటీస్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌, మాగ్నమ్‌ వెంచర్స్‌ ఉన్నాయి.

గరిష్టాన్ని చేరిన షేర్లు
నేడు ఎన్‌ఎస్‌ఈలో 8 రకాల షేర్లు మాత్రమే 52 వారాల గరిష్టాన్ని తాకాయి. వీటిలో ఆల్‌కెమిస్ట్‌, అస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎడ్యుకంప్‌ సొల్యూషన్స్‌, జేఎంటీ ఆటో, ప్రకాశ్‌ స్టీలేజ్‌, రుచీ సోయా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 1:45 గంటల ప్రాంతంలో నిఫ్టీ 10.05 పాయింట్లు లాభపడి 8,889.15 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 212.87 పాయింట్లు లాభపడి 30,404.25 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 

Related Tweets
మరిన్ని వార్తలు