ఏబీబీ, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌లు ఏడాది కనిష్టానికి

22 May, 2020 13:23 IST|Sakshi

శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రారంభంలో లాభాల్లో ట్రేడ్‌ అయినప్పటికీ, తరువాత నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో 37 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో ఏబీబీ ఇండియా, ఏబీఎం ఇంటర్నేషనల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బి.సి.పవర్‌ కంట్రోల్స్‌, ఛాల్లెట్‌ హోటల్స్‌, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌, చోళమండళమ్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌, సైయెంట్‌, డీసీబీ బ్యాంక్‌, జీఈటీ అండ్‌ డీ ఇండియా, హోటల్‌ రగ్బీ, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పొర్టేషన్‌ నెట్‌వర్క్స్‌, ఇండ్‌స్విఫ్ట్‌, కేడీడీఎల్‌, కర్ణాటకా బ్యాంక్‌, లిబాస్‌ డిజైన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లు ఉన్నాయి.

గరిష్టాన్ని తాకిన షేర్లు
 నేడు ఎన్‌ఎస్‌ఈలో 9 షేర్లు మాత్రమే 52 వారాల గరిష్టాన్ని తాకాయి. వీటిలో ఆల్‌కెమిస్ట్‌,ఎడ్యుకంప్‌ సొల్యూషన్స్‌, ద ఇండియా సిమెంట్స్‌, జేఎంటీ ఆటో, ప్రకాష్‌ స్టీలేజ్‌, రాజ్‌రతన్‌ గ్లోబల్‌ వైర్‌, రుచీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, వినైల్‌ కెమికల్స్‌(ఇండియా), వ్యాబ్కో ఇండియాలు ఉన్నాయి. కాగా మధ్యహ్నా 1:30 గంటల ప్రాంతంలో నిఫ్టీ 107.10 పాయింట్లు నష్టపోయి 8,999 వద్ద  ట్రేడ్‌ అవుతోంది. బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 430.41 పాయింట్లు నష్టపోయి 30,500 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Related Tweets
మరిన్ని వార్తలు