నేడు 2018–19 జీడీపీ గణాంకాలు

31 May, 2019 08:28 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి మార్చి త్రైమాసికంసహా (జనవరి–మార్చి) 2018–19 ఆర్థిక సంవత్సరం గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం ఈ గణాంకాలను విడుదల చేయనుంది.  మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 6.5 శాతమే ఉండే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇండస్ట్రీ చాంబర్‌ ఫిక్కీ ఇదే అంచనాలను గురువారం వెలువరించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, వృద్ధి రేటు 7.4– 7.1 శాతం శ్రేణిలో ఉంటుందన్నది ఫిక్కీ అంచనా.  అయితే 2019–20లో 7.1 శాతం, 2020–2021లో 7.2 శాతం వృద్ధి నమోదవుతుందని తన సర్వే అంచనావేసినట్లు ఫిక్కీ వివరించింది. 2019–20లో వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.3 శాతం వరకూ ఉంటుందని సర్వే పేర్కొన్నట్లు తెలిపింది. కాగా సకాలంలో రుణ లభ్యత, జీఎస్‌టీ రిఫండ్స్‌ జరగాలని, ఎగుమతి సంబంధిత మౌలిక రంగం మరింత మెరుగుపడాలని ఆయా అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయనీ ఫిక్కీ సర్వే అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు