పసిడి పరుగుకు బ్రేక్‌

21 May, 2020 11:08 IST|Sakshi

రూ.46,500 పైన స్థిరంగా పసిడి

గత మూడురోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధర గురువారం స్వల్పంగా తగ్గింది. ఉదయం 10:50 గంటల ప్రాంతంలో  దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.288 తగ్గి 10 గ్రాముల పసిడి రూ. 46,978 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగాను పసిడి పరుగులకు బ్రేక్‌ పడింది. నిన్నటితో పోలిస్తే 11 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం 1,742.50 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య అనిశ్చితి, సెంట్రల్‌ బ్యాంకులు నాలుగోసారి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తాయన్న ఆశలతో బంగారం ధర మూడు రోజులుగా పరుగులు పెట్టింది. అయితే చైనా కంపెనీలు అమెరికా ఎక్సెంజ్‌లలో లిస్ట్‌ అవ్వకుండా ఉండేందుకు యూఎస్‌ సెనేట్‌ బిల్‌ పాస్‌ చేసింది. దీంతో నేడు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related Tweets
మరిన్ని వార్తలు