స్థిరంగా పుత్తడి ధర

30 May, 2020 10:05 IST|Sakshi

శుక్రవారం  బంగారం ధర హెచ్చుతగ్గుల మధ్య చివరికి ఎటువంటి మార్పులు లేకుండా ముగిసింది. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో ఉదయం సెషన్‌లో 10 గ్రాముల పసిడి రూ.46,523 వద్ద ప్రారంభమై రూ.46,530 వద్ద ముగిసింది. ఒక దశలో రూ.46,868 వద్ద గరిష్టాన్ని, రూ.46,394 వద్ద కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం 12 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,731.60  వద్ద ముగిసింది. నిన్నసాయంత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మీడియా సమావేశంలో చైనా, డబ్ల్యూహెచ్‌ఓ సంబంధాలపై మరోసారి విరుచుకుపడడం, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంక్షోభం రోజురోజుకి ముదురుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

>
Related Tweets
మరిన్ని వార్తలు