నేడు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష

1 Dec, 2015 02:01 IST|Sakshi
నేడు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష

న్యూఢిల్లీ:  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)  డిసెంబర్ 1వ తేదీన ఐదవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5 శాతానికి చేరడం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో... డిసెంబర్ 1వ తేదీన ఆర్‌బీఐ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  అలాగే ఇప్పటికే తగ్గించిన రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా తగిన స్థాయిలో కస్టమర్లకు బదలాయించలేదన్న అభిప్రాయమూ ఉంది.  ఆర్‌బీఐ నుంచి తాము తీసుకునే స్వల్పకాలిక రుణంపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు రెపో ప్రస్తుతం నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో 6.75 శాతంగా ఉంది.
 

మరిన్ని వార్తలు