రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ నుంచి టాప్‌-3 స్టాక్‌ సిఫార్సులు

20 Jun, 2020 16:29 IST|Sakshi

అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ర్యాలీతో సూచీలు ఈ వారాంతాన్ని లాభంతో ముగించాయి. రాబోయే 3-6 నెలల్లో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయననే ‘ఆశ’లు కూడా సూచీల సానుకూల సెంటిమెంట్‌కు కలిసాచ్చాయి. భారత్‌ చైనాల మధ్య సరిహద్దు వివాదం వివాదం, ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడం, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ మందగమనం లాంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., ఈ వారంలో సూచీలు లాభాలను ఆర్జించగలిగాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 951 పాయింట్లు, నిఫ్టీ 272 పాయింట్లు చొప్పున ఎగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 2.8 శాతం, నిఫ్టీ 2.7 శాతం లాభపడ్డాయి.  రానున్న రోజుల్లో మార్కెట్‌ మిశ్రమ వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ 3 స్టాకులను సిఫార్సు చేసింది. టెక్నికల్‌ అంశాలను బేరీజు వేసుకుని వచ్చే 3నెలల్లో ఈ 3షేర్లు 22శాతం వరకూ లాభాలను పంచవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. 

షేరు పేరు: పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ 
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.100
అప్‌సైడ్‌: 17శాతం
విశ్లేషణ: ఇటీవల షేరు స్వల్పకాలిక, మీడియం టర్మ్‌ యావరేజ్‌లకు బలమైన వాల్యూమ్స్‌తో క్రాష్‌ కావడంతో షేరు ప్రస్తుత స్థాయి నుంచి మంచి ప్రదర్శన కనబరచవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది షేరు గరిష్టం రూ.134 నుంచి తన 50శాతం రిట్రేస్‌మెంట్‌ను రూ.74 వద్ద పూర్తి చేసింది. వీక్లీ ఛార్ట్‌లో ఏర్పడిన హయ్యర్‌ బాటమ్స్‌ షేరులో బలాన్ని చూపుతున్నాయి. వీక్లీ ఆర్‌ఎస్ఐ తన యావరేజ్‌ లైన్‌ను అధిగమిచడం షేరు బలమైన బ్రేక్‌ అవుట్‌ను సూచిస్తుంది. సెక్టార్‌లో పాజిటివ్‌ మూమెంటమ్‌ కూడా షేరు తదుపరి ర్యాలీకి కలిసొస్తుంది.

షేరు పేరు: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ. 439
అప్‌సైడ్‌: 11శాతం 
విశ్లేషణ: షేరు తన వీక్లీ ఛార్ట్‌లో రూ.380-385 పరిధిలో ట్రిపుల్‌ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. డైలీ ఛార్ట్‌లో ఇన్‌సైడ్‌ రేంజ్‌ బ్రేక్‌ అవుట్‌ ఇవ్వొచ్చు. డైలీ ఆర్‌ఎస్‌ఐ 50 స్థాయిపై ట్రేడ్‌ అవుతోంది. ఇది అప‍్పర్‌ హాండ్‌లో షేరు బుల్లిష్‌ సెట్‌ ఏర్పాటును ఇండికేట్‌ చేస్తుంది. ఈ షేరుకు రూ.375-385 పరిధిలో మల్టీపుల్‌ మద్దతు ధరలను కలిగి ఉంది. ఇది ప్రస్తుత షేరు వద్ద కొనుగోలుకు రిస్క్‌-రివార్డుకు మంచి అవకాశం.


షేరు పేరు: సన్‌ ఫార్మా 
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.590
అప్‌సైడ్‌: 22శాతం
విశ్లేషణ: ఈ షేరు గతవారంలో రూ.515 వద్ద రికార్డు స్థాయిని తాకి కరెక‌్షన్‌కు లోనైంది. తర్వాత షేరు  దాని దీర్ఘకాలిక యావరేజ్‌ నుండి తిరిగి వచ్చింది. సెక్టార్‌ ప్రస్తుతం అప్‌ట్రెండ్‌లో ఉంది. వీక్లీ ఛార్ట్‌లో హైయర్‌ బాటమ్‌ ఫార్మేషన్‌ను నమోదు చేసింది. రానున్న నెలల్లో బలమైన మూమెంటం ఉటుందని మంత్లీ ఛార్ట్‌లు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ షేరు 34నెలల యావరేజ్‌ బలమైన వ్యాల్యూమ్స్‌తో బ్రేక్‌ చేసింది. 

>
మరిన్ని వార్తలు