మార్కెట్‌లో కంపెనీల దూకుడు..

7 Jun, 2020 19:27 IST|Sakshi

ముంబై: దేశంలోని ప్రముఖ కంపెనీలు మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి. గత వారం మార్కెట్‌ విలువ ఆధారంగా పది కంపెనీలు రూ. 2.46 లక్షల కోట్ల రూపాయలతో తమ హవా కొనసాగిస్తన్నాయి. ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)  మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ .73,156.71 కోట్ల నుంచి రూ.10,02,006.10 కోట్లకు పెరిగింది. తరువాతి స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.46,036.95 కోట్ల నుంచి రూ .5,67,697.09 కోట్లు.. కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ .30,888.39 కోట్లు నుంచి రూ.2,65,080.63 కోట్లకు పెరిగాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విలువ రూ .28,724.5 కోట్ల నుంచి రూ.7,68,525.91 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ .18,524.25 కోట్ల నుంచి 3,05,931.57 కోట్లతో  మార్కెట్‌లో సత్తా చాటాయి. 

మొబైల్‌ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ రూ .3,19,095.55 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ .2,31,330.39 కోట్లు, హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్)  రూ .4,90,398.08 కోట్లు, ఇన్ఫోసిస్‌ రూ.2,99,734.72 కోట్లు, ఐటీసీ రూ.2,45,783.16 కోట్లతో మార్కెట్‌లో తమ హవా కొనసాగిస్తున్నాయి. టాప్ -10 సంస్థల ర్యాంకింగ్‌లో ఆర్‌ఐఎల్ తన నంబర్‌ వన్‌ స్థానాన్ని కొనసాగించగా.. తరువాతి స్థానాల్లో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యుఎల్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు తరువాతి స్థానాల్లో నిలిచాయి
చదవండి: దేశీ టెల్కోల్లో..టెక్‌చల్‌!

మరిన్ని వార్తలు