టోయోటా క్రేజీ వెహికిల్‌, మీరే చూడండి ఎలా ఉందో..

16 Jan, 2018 16:56 IST|Sakshi

జపాన్‌కు చెందిన టోయోటా కంపెనీ, క్రేజీ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాన్ని విడుదల చేసింది. ఇ-పాలెట్ పేరుతో లాస్‌ వేంగాస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో(సీఈఎస్‌)లో ఈ వాహనాన్ని టోయోటా ప్రదర్శించింది. బాక్స్‌ ఆకారంలో ఉన్న ఈ వాహనం మూడు సైజుల్లో మార్కెట్‌లోకి వస్తుంది. దీనిలో పెద్ద సైజు వాహనం అచ్చం బస్సు మాదిరి ఉంది. సరుకు రవాణాకు, పెద్ద పెద్ద డెలివరీలకు దీన్ని వాడుకోవచ్చు. 

వివిధ సైజుల్లో ఉన్న ఈ వాహనాన్ని పలు అవసరాలకు వాడుకోవచ్చని టోయోటా కూడా చెబుతోంది. వెహికిల్‌ సైజు బట్టి సరుకుల డెలివరీకి, ప్రజారవాణాకు, మొబైల్‌ స్టోర్‌ఫ్రంట్‌కు లేదా ఆఫీసు అవసరాల కోసం వినియోగించుకోవచ్చని పేర్కొంటోంది. అమెజాన్‌, దీదీ, పిజ్జా హట్‌, ఉబర్‌ లాంటి కంపెనీల ఇన్‌పుట్‌ల ద్వారా ఈ వాహనాన్ని డిజైన్‌ చేశామని, 2020 నుంచి ఈ వాహానాన్ని టెస్ట్‌ చేయనున్నట్టు టోయోటా పేర్కొంది. 2020లో టోక్యోలో జరుగబోయే పారాలింపిక్‌ గేమ్స్‌లో కూడా ఈ వాహనం పాలుపంచుకోనుంది. 

టెక్నాలజీలో మార్పులు సంభవిస్తున్న కొద్దీ, దానికి అనుకూలంగా ఆటో పరిశ్రమ కూడా రూపాంతరం చెందుతోంది. ఎలక్ట్రిఫికేషన్‌, కనెక్టెడ్‌, ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ ఇవన్నీ ప్రస్తుతం రాబోతున్న తరాల వారి ముందుకు వస్తున్న వాహనాలు. సంప్రదాయ కార్లకు మించి తమ విస్తరణను ఇది ప్రదర్శిస్తుందని టోయోటా ప్రెసిడెంట్‌ అకియో టోయోడా చెప్పారు. ఎయిర్‌లెస్‌ టైర్లతో ఓ కాన్సెప్ట్‌ వాహనాన్ని కూడా టోయోటా 2017లో ప్రవేశపెట్టింది. 
 

మరిన్ని వార్తలు