టయోటా నుంచి ప్లాటినం ఎతియోస్, ఎతియోస్ లివా

30 Sep, 2016 01:35 IST|Sakshi
టయోటా నుంచి ప్లాటినం ఎతియోస్, ఎతియోస్ లివా

హైదరాబాద్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ ఇటీవల ప్లాటినం ఎతియోస్, ఎతియోస్ లివా అనే రెండు మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎక్కడా రాజీపడని టయోటా.. ఈ సరికొత్త మోడల్స్‌లో అందుబాటు ధరలోనే పలు భద్రతా ఫీచర్లను పొందుపరిచింది. అన్ని స్థాయిల్లో స్టెబిలైజ్‌డ్ డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఎతియోస్ తన విభాగానికి సంబంధించి పరిశ్రమలోనే ఇలాంటి ప్రత్యేకతలను కలిగిన తొలి మోడల్‌గా నిలిచిందని కంపెనీ వివరించింది.

మరిన్ని వార్తలు