మైక్రోసాప్ట్ తో చేతులు కలపనున్న టయోటా

5 Apr, 2016 16:46 IST|Sakshi
మైక్రోసాప్ట్ తో చేతులు కలపనున్న టయోటా

టోక్యో : ఇంటర్నెట్ కార్లను మార్కెట్లోకి మరిన్ని విస్తరించాలని టయోటా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే జపాన్ లో ఈ తరహా ఆటోమొబైల్స్ ను ప్రవేశపెట్టిన ఆ దేశీయ కార్ల కంపెనీ టయోటా, యూఎస్ టెక్ దిగ్గజం మెక్రోసాప్ట్ తో చేతులు కలపనుంది. టెక్నాలజీ పరంగా మైక్రోసాప్ట్ సహాయం తీసుకుని, భవిష్యత్ లో మరిన్ని ఇంటర్నెట్ సేవలను కార్లలో అందించాలనుకుంటోంది. ఈ సేవలు అడ్వాన్స్ డ్ క్లౌండ్ డేటా అనాలిసిస్ ఆధారంగా డ్రైవర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు అందించాలని టయోటా నిర్ణయించింది.

కొత్త తరహాలో వచ్చే ఈ కార్ల విధానాలను డ్రైవర్లు నేర్చుకోవాలని టయోటా పేర్కొంది. టెక్నాస్ లో ఏర్పాటుచేసిన ఈ కార్ల కంపెనీలో తొలుత 5.5 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇంటర్నెట్ తరహా కార్లు జపాన్ తో పాటు యూఎస్ లోనూ చక్కర్లు కొట్టేలా చేయాలని టయోటా లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు