అగ్రస్థానం నుంచి దిగిన టయోటా

31 Jan, 2017 00:57 IST|Sakshi
అగ్రస్థానం నుంచి దిగిన టయోటా

గత ఏడాది ఫోక్స్‌ వ్యాగన్‌దే
టోక్యో: ప్రపంచవ్యాప్తంగా అధికంగా కార్ల విక్రయిస్తున్న కంపెనీ ఖ్యాతిని జపాన్‌కు చెందిన టయోటా కోల్పోయింది. గత ఏడాది కార్ల విక్రయాల్లో అగ్ర స్థానాన్ని ఫోక్స్‌వ్యాగన్‌ చేజిక్కించుకుంది. పర్యావరణ నిబంధనలకు సంబంధించి మోసానికి పాల్పడి అపఖ్యాతి పాలయినప్పటికీ, జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌కు ఈ అగ్రస్థానం దక్కడం విశేషం. గత ఏడాది తమ కార్ల అమ్మకాలు 3.8 శాతం పెరిగాయని ఫోక్స్‌వ్యాగన్‌ తెలిపింది. 2015లో 99.3 లక్షలకు పడిపోయిన తమ అమ్మకాలు గత ఏడాది 1.03 కోట్లకు పెరిగాయని, చైనాలో విక్రయాలు జోరుగా ఉన్నాయని వివరించింది. కాగా టయోటా కంపెనీ గత ఏడాది తమ అమ్మకాలు 0.2 శాతం వృద్ధితో 1.01 కోట్లకు పెరిగాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు