క్యూ3లో క్యాడ్‌ 2.5 శాతం 

30 Mar, 2019 01:19 IST|Sakshi

ముంబై: దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) అక్టోబర్‌–డిసెంబర్‌ కాలంలో (ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే, 2.5%గా నమోదయ్యింది. విలువలో క్యాడ్‌ పరిమాణం 16.9 బిలియన్‌ డాలర్లు. 2017– 2018 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 13.7 బిలియన్‌ డాలర్లు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ మధ్య ఈ విలువ 19.1 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 2.9 శాతం).

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. కాగా 2018 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకూ మొత్తం కాలాన్ని తీసుకుంటే, క్యాడ్‌  జీడీపీలో 2.6 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ రేటు 1.8%. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) మధ్య నికర వ్యత్యాసమే కరెంట్‌ అకౌంట్‌ లోటు.   

మరిన్ని వార్తలు