మరింత  పెరిగిన వాణిజ్యలోటు

15 Jun, 2018 13:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కరంగా మారిన  వాణిజ్య  లోటు తాజాగా మరింత భయపెడుతోంది.  మే నెలలో వాణిజ్య లోటు 14.62 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతులు 15 శాతం పెరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. మే మాసానికి సంబంధించిన ట్రేడ్‌ డెఫిసిట్‌  14.62 బిలియన​ డాలర్లుగా  నమోదైందని వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు  ప్రకటించారు.  

గత ఏడాది ఇదే కాలానికి వాణిజ్య లోటు 13.85 బిలియన్ల డాలర్లుగా ఉంది.  ఎగుమతులు 28.86 బిలియన్‌ డాలర్లు.  గత ఏడాది  24.01 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 20.18శాతం వృద్ధిని సాధించాయి. దిగుమతులు 43.38  బిలియన్‌ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన 14.85 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దిగుమతులు గత ఏడాది 37.86  బిలియన్‌ డాలర్లుగా ఉంది. ముడి చమురు దిగుమతులు 49.46 శాతం పెరిగి 11.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.  ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు