పేటీఎమ్‌ టు ఫ్రీచార్జ్‌ వయా యూపీఐ

14 Mar, 2017 12:32 IST|Sakshi
పేటీఎమ్‌ టు ఫ్రీచార్జ్‌ వయా యూపీఐ

ముంబై: మొబైల్‌ డిజిటల్‌ వాలెట్లు వాడుతున్నారా... ఒక వాలెట్ లోని అమౌంట్‌ని ఇంకోవాలెట్‌కు మార్చుకోలేకపోతున్నారు కదా... ఇప్పుడు ఆ దిగులు అవసరం లేదు. త్వరలో ఆర్బీఐ ఓ అద్భుతమైన సదుపాయం తీసుకు రాబోతోంది. ఇప్పటి వరకూ మొబైల్‌ వాలెట్‌లో అమౌంట్‌ జతచేసుకొని కేవలం మొబైల్‌ రీచార్జి, షాపింగ్‌లు, బస్పు టికెట్ల బుకింగ్‌ చేసుకొనేవాళ్లు. పేటీఎమ్‌, ఫ్రీచార్జీ వాలెట్లనుంచి మన బ్యాంకు అకౌంట్లకు తిరిగి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

కానీ త్వరలో సరికొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. ఒక వాలెట్‌ నుంచి మరో వాలెట్‌ కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే సదుపాయం  ఆర్బీఐ త్వరలో తీసుకురానుంది. ఉదాహరణకు మీకు పేటీఎమ్‌, ఫ్రీచార్జీ వాలెట్లు ఉన్నాయి.మామూలుగా మీ పేటీఎమ్‌ అకౌంటు నుంచి ఫ్రీచార్జీ మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడం కుదరదు. కానీ ఇప్పుడు ట్రాన్స్‌ఫర్‌  చేసుకోవడానికి వీలుగా ఆర్బీఐ డిజిటల్‌ వ్యాలెట్ల మధ్య యూపీఐ(UPI) సేవలను అందుబాటులోని తీసుకురావటానికి ఏర్పాట్లు చోస్తోంది. వచ్చే రెండు మూడు నెలల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో డిజిటల్‌ ట్రాన్సక్షన్స్‌ మరింత సులభతరం కానున్నాయి.

మరిన్ని వార్తలు