ఇదో ముక్కోణపు కథ..

31 Dec, 2016 01:23 IST|Sakshi
ఇదో ముక్కోణపు కథ..

ఆర్‌బీఐ–బ్యాంకులు– కేంద్రం
బ్యాంకులు 2017 మార్చికల్లా ఎన్ పీఏలకు పూర్తి కేటాయింపులు చేసి బ్యాలన్స్ షీట్లలో చూపించాలని రఘురామ్‌ రాజన్ షరతు పెట్టారు. నల్లధనాన్ని ఏరేయాలనుకున్న కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి ఆర్‌బీఐపై భారీ బాధ్యతే పెట్టింది. చివరి రెండు నెలలూ తమ వ్యాపారాన్నంతా పక్కన పెట్టి బ్యాంకులు జనం నుంచి పాత నోట్లు తీసుకోవటం, కొత్త నోట్లు ఇవ్వటానికే పరిమితమయ్యాయి. ఇదో ట్రయాంగిల్‌ స్టోరీలా మారింది. బ్యాంకుల ఎన్ పీఏలు సెప్టెంబర్‌ నాటికే రూ.7 లక్షల కోట్లను దాటేశాయి. వీటిలో అధికం ప్రభుత్వ రంగ బ్యాంకులవే. వీటికి కేటాయింపులు చేయడం బ్యాంకులకు సవాలుగా మారింది. ఆస్తులు అమ్మి రుణాలు తీర్చటానికి కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నా అవి ఫలించటం లేదు.  ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారూ భారీగానే ఉన్నారు. ఇవన్నీ ఎన్ పీఏలను పెంచేశాయి. అయితే, నోట్ల రద్దుతో బ్యాంకుల్లో చేరిన భారీ డిపాజిట్లు మూలధన అవసరాలు తీరుస్తాయనేది తాజా అంచనా.

ద్రవ్యోల్బణమే ఆర్‌బీఐ టార్గెట్‌?
రఘురామ్‌ రాజన్ మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్‌ 4తో ముగిసింది. తర్వాత ఉర్జిత్‌ పటేల్‌ గవర్నర్‌ అయ్యారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న విషయంలో కేంద్రం, ఆర్‌బీఐ అంగీకారానికి వచ్చాయి. ఇక ఆర్‌బీఐ అనుమతుల మేరకు దేశంలో ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంకు, ఈక్విటీస్‌ స్మాల్‌ బ్యాంకు పేరుతో కొత్త తరహా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు