టూ కాలర్ నుంచి ట్రూ డయలర్ యాప్

30 Oct, 2014 00:56 IST|Sakshi
టూ కాలర్ నుంచి ట్రూ డయలర్ యాప్

న్యూఢిల్లీ: ఫోన్‌బుక్‌లో లేకపోయినప్పటికీ మనం కాల్ చేస్తున్న నంబరుకు సంబంధించిన వారి వివరాలను చెప్పేసే కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ట్రూ డయలర్ పేరిట ఫోన్ డెరైక్టరీ యాప్ సంస్థ ట్రూకాలర్ దీన్ని ఆవిష్కకరించింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మన ఫోన్‌బుక్‌లో లేని కొత్త నంబరుకు కాల్ చేయాల్సి వచ్చినప్పుడు సదరు నంబరును ఉపయోగిస్తున్న వారి పేరు, ప్రొఫైల్ ఫొటో వంటి వివరాలను ఈ యాప్ ఆటోమేటిక్‌గా సెర్చి చేసి, అందిస్తుంది. ఇది పూర్తిగా ఉచిత యాప్. ప్రస్తుతం ట్రూకాలర్‌కి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల మంది యూజర్లు ఉండగా.. ఇందులో దాదాపు సగభాగం భారత్ నుంచే ఉన్నారు.

మరిన్ని వార్తలు