బీదర్‌కు ట్రూజెట్‌ సర్వీసులు

8 Feb, 2020 05:41 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ట్రూజెట్‌ పేరుతో విమాన సేవల్లో ఉన్న హైదరాబాద్‌ సంస్థ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ తాజాగా తన నెట్‌వర్క్‌లోకి బీదర్‌ను చేర్చింది. ఉడాన్‌ సర్వీసుల్లో భాగంగా బెంగళూరు–బీదర్‌–బెంగళూరు మధ్య ఫ్లయిట్‌ను ప్రతిరోజూ నడుపుతారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కొత్త సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి విమానంలో బీదర్‌ ప్రయాణించారు.

బస్సులో 12 గంటల సమయం పడుతుందని, విమానంలో గంట 40 నిమిషాల్లోనే చేరుకున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. బీదర్‌ చేరికతో ట్రూజెట్‌ నెట్‌వర్క్‌లో డెస్టినేషన్ల సంఖ్య 24కు చేరుకుందని టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ డైరెక్టర్‌ కె.వి.ప్రదీప్‌ వెల్లడించారు. కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఈ స్థాయికి చేరుకున్నామని కంపెనీ సీఈవో కల్నల్‌ ఎల్‌ఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. కాగా, స్ప్రింగ్‌ సర్‌ప్రైజ్‌ పేరుతో నాలుగు రోజుల సేల్‌లో భాగంగా బెంగళూరు–బీదర్‌–బెంగళూరు రూట్లో బేస్‌ ఫేర్‌ రూ.699కే అందిస్తోంది.
 సర్వీసు ప్రారంభిస్తున్న కర్ణాటక సీఎం, తదితరులు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా