ఎయిర్‌లైన్‌ షేర్లను విక్రయించి బఫెట్‌ తప్పు చేశారు: ట్రంప్‌

6 Jun, 2020 12:17 IST|Sakshi

ఎయిర్‌లైన్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను విక్రయించి వారెన్‌ ఒఫెట్‌ తప్పుచేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. వైట్‌ హౌస్‌లో శుక్రవారం జరిగిన ఓ న్యూస్‌ కాన్ఫరెన్స్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ ...  కొన్నిసార్లు బఫెట్‌ లాంటి అనుభవజ్ఞులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. బఫెట్ ఎయిర్‌లైన్‌ స్టా‍క్లులను విక్రయించకుండా ఉండాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం ఎయిర్‌షేర్లు భారీగా లాభపడుతున్నాయి. అయితే బఫెట్‌పై తనకు అపారమైన గౌరవం ఉందని ట్రంప్‌ తెలిపారు. తాను మాత్రం జీవితాంతం సరైన నిర్ణయాలే తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు. 

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో బఫెట్‌ అమెరికాలోని ప్రధానమైన 4 ఎయిర్‌లైన్స్‌ కంపెనీల షేర్లను విక్రయించారు. విచిత్రంగా బఫెట్‌ విక్రయం తర్వాత ఈ ఎయిర్‌లైన్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఈ ఒక్క వారంలోనే డెల్టా ఎయిర్‌లైన్‌ షేరు 40శాతానికి పైగా పెరిగింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్‌ షేరు 90శాతం, సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ షేరు 25శాతం, యూనైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ హోల్డింగ్‌ షేరు 60శాతానికి పైగా లాభపడింది.  

బఫెట్‌ 2016 నుంచి ఎయిర్‌టెల్‌ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. తన సొంత సంస్థ బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశం ఈ మేనెలలో జరిగింది. ఈ సందర్భంగా బఫెట్‌ మాట్లాడుతూ వైమానిక పరిశ్రమ పట్ల ప్రపంచ థృక్పథం మారిపోయిందన్నారు.

మరిన్ని వార్తలు