అమెజాన్‌కు షాక్‌: ట్రంప్‌ టాక్స్‌ వార్‌

30 Mar, 2018 10:29 IST|Sakshi
​అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌( ఫైల్‌ ఫోటో)

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆన్‌లైన్‌ రీటైల్‌ దిగ్గజం అమెజాన్‌పై  మరోసారి  తన ఆగ్రహాన్ని వెళ్ల గక్కారు.  పన్నులు చెల్లించకుండా  భారీ ఆదాయాన్ని దండు కుంటోందంటూ తన తాజా ట్వీట్‌లో దాడి చేశారు.  ఇటీవల మీడియా నివేదికలకు బలం  చేకూరుస్తూ ట్రంప్‌  గురువారం మరో ట్వీట్‌ చేశారు. ఎన్నికలకు ముందు అమెజాన్‌ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశా..పన్నులు చెల్లించకుండా.. పన్ను చెల్లిస్తున్న చిన్నవ్యాపారులకు తీరని నష్టం చేకూరుస్తోందంటూ అమెజాన్‌పై ఆయన ధ్వజమెత్తారు. ఇతరుల మాదిరిగా కాకుండా చాలా స్వల్పంగా లేదా  అసలు పన్నులు చెల్లించకుండా వేలాదిమంది రీటైలర్ల వ్యాపారాన్ని దెబ‍్బతీస్తోంది. తమ పోస్టల్‌ సిస్టంను అమెజాన్‌ డెలీవరీ బాయ్‌గా వాడుకుంటూ  అమెరికాకు తీరని నష్టాన్ని కలిగిస్తోందంటూ ట్విటర్‌లో మండిపడ్డారు.

మరోవైపు అధ్యక్షుడి ప్రకటనకు  వైట్ హౌస్ ట్రంప్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ లిండ్సే వాల్టర్స్  మద్దతు పలికారు. అమెజాన్‌ చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో భారతదేశంతో సహా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అమెజాన్‌ వ్యాపారాన్ని  దెబ్బతీసేలా  పటిష్టమైన ఆంక్షల తీసుకోనుందనే  సంకేతాలను అందించారు. ఈ వ్యాఖ్యలు మార్కెట్‌లో షేరు కదలికలపై మరింతగా ప్రభావం  చూపనుంది. ముఖ‍్యంగా  యాంటీ ట్రస్ట్ చట్టాన్ని  ఉపయోగించేందుకు  ముమ్మరంగా చర‍్చలు నిర్వహించారని యాక్సోస్‌ అనే వెబ్‌సైట్‌ నివేదించడంతో అమెజాన్‌ భారీ నష్టాలను మూటగట్టుకుంది.  అమెజాన్‌ షేరు 5శాతం నష్టపోయి 30 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ వాల్యూని కోల్పోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు