కొత్త జూపిటర్‌.. మైలేజీ సూపర్‌

27 Nov, 2019 20:18 IST|Sakshi

బీఎస్‌-6 ప్రమాణాలతో టీవీఎస్‌ జూపిటర్‌ క్లాసిక్‌ 

ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ

ధర రూ. 67, 911

సాక్షి,  న్యూఢిల్లీ:  బీఎస్‌ -6  బైక్స్‌  మార్కెట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలతో పాటు, తాజాగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కొత్త జూపిటర్‌ క్లాసిక్‌ ఈటీ-ఎఫ్‌ఐ మోడల్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆర్‌టీ-ఎఫ్‌ఐ (రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్), ఈటీ-ఎఫ్‌ఐ (ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్) టెక్నాలజీ అనే రెండు వెర్షన్లను డెవలప్‌ చేసినప్పటికీ, ప్రస్తుతం  ఈటీ-ఎఫ్‌ఐ టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ స్కూటర్‌ ఎక్స్‌షోరూం ధరను రూ. 67,911గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమలులోకి రానున్న బీఎస్‌-6 ప్రమాణాలను అందుకోవడంలో భాగంగా దీన్ని బుధవారం లాంచ్‌ చేసింది. 

బీఎస్‌-6 కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈటీ-ఎఫ్‌ఐ టెక్నాలజీ మెరుగైన పనితీరు, అధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త జూపిటర్‌ క్లాసిక్‌ 15 శాతం అధిక మైలేజీని ఇస్తుందని పేర్కొంది. జూపిటర్ క్లాసిక్‌లో 110 సీసీ బీఎస్‌-6 ఇంజిన్‌తోపాటు ఫ్రంట్ ప్యానెల్‌లో మొబైల్‌  కోసం ప్లేస్‌, యుఎస్‌బీ ఛార్జర్‌, టిన్‌టెడ్‌ విండ్‌స్ర్కీన్‌ వంటి ఫీచర్లను జోడించారు. ఇది 7500 ఆర్‌పీఎం వద్ద 7.9 బీహెచ్‌పీ శక్తిని, 5500 ఆర్‌పీఎం వద్ద 8ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ‘ఈటీ-ఎఫ్‌ఐ టెక్నాలజీని భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశాం. జూపిటర్ క్లాసిక్‌ ఈటీ-ఎఫ్‌ఐ అధిక మైలేజీతో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంద’ని టీవీఎస్ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్ అనిరుధ్‌ హల్దార్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు శుభవార్త, కొత్త ఫీచర్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌, ఆఫర్లు

లాభాల జోరు, రికార్డు ముగింపు

రెడ్‌మి నోట్‌ 8 కొత్త వేరియంట్‌ చూశారా?

లాగిన్‌ కాకుంటే ఆ ఖాతాలు తొలగిస్తాం

రియల్టీ షాక్‌,  ఆరంభ లాభాలు ఆవిరి

లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

పదేళ్లలో రూ.110 లక్షల కోట్లకు పెరగాలి

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం 73 శాతం డౌన్‌

స్కోడా చకన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తికి బ్రేక్‌

రూపాయి... రెండు వారాల గరిష్టం @ 71.50

సీఎస్‌బీ బ్యాంక్‌ ఐపీఓ... అదరహో !

 హైదరాబాద్‌లో ఇంటెల్‌ అభివృద్ధి కేంద్రం

హాంకాంగ్‌లో అలీబాబా అదుర్స్‌

సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు జోరు

ఇక ముద్రా ‘మొండి’ భారం..!

కార్వీలో వాటా విక్రయం?

ముద్రా రుణాలను జాగ్రత్తగా పరిశీలించాలి

హానర్‌ పవర్‌ఫుల్‌ 5జీ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ 

లాభాల స్వీకరణ : 41వేల దిగువకు సెన్సెక్స్‌

ఉద్యోగులు మెచ్చే కంపెనీలు ఇవే!

ఛైర్మన్‌ షాక్‌తో జీ షేర్లు ఢమాల్‌

గరిష్టాలనుంచి వెనక్కి తగ్గిన సూచీలు

గ్లోబల్‌ జోష్‌తో నిఫ్టీ ఆల్‌టైం హై..

లేఆఫ్స్‌తో టెకీల్లో గుబులు..

ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో ఎయిర్‌టెల్, జియో

కార్పొరేట్‌ పన్ను కోతకు బిల్లు

నిలిచిపోనున్న ఇండిగో పాత విమానాలు

టెలికం ప్యాకేజీపై కమిటీ రద్దు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నకిలీ ఫోటో వైరల్‌, చిన్మయి వివరణ

వర్మ మరో సంచలనం; టీజర్‌ విడుదల

ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌.. స్పందించిన సందీప్‌

వాట్సాప్‌లో ఉన్నావా.. లేదు అమీర్‌పేట్‌లో..

నిక్‌ జొనాస్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రియాంక

ఛీ.. మేకప్‌ లేకుండానే బాగున్నావు