టీవీఎస్ విక్రయ జోరు..

2 May, 2017 20:28 IST|Sakshi
చెన్నై : టూ, త్రీ వీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్ ఏప్రిల్ నెలలో తన అమ్మకాలను 8.46 శాతం పెంచేసుకుంది. నగరానికి చెందిన ఈ కంపెనీ మొత్తంగా ఎగుమతులతో కలిపి 2,46,310 వెహికల్స్ ను విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో ఈ విక్రయాలు 2,27,096 యూనిట్లగా మాత్రమే ఉన్నాయి.  దేశీయ మార్కెట్ లో కంపెనీ టూవీలర్స్ విక్రయాలు 3.96 శాతం పెరిగి 2,05,522 యూనిట్లుగా ఉన్నాయి. 2016 ఏప్రిల్ లో ఇవి 1,97,692 యూనిట్లు మాత్రమే. స్కూటర్ అమ్మకాలు కూడా 28.57 శాతం పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. మోటార్ సైకిల్ విక్రయాల వృద్ధిలో 10.38 శాతం పెరిగి, 99,890 యూనిట్లుగా రికార్డు అయినట్టు తెలిపింది.
 
ఇక ఎగుమతులు విషయానికి వస్తే గతేడాది 28,354 యూనిట్లుగా ఉన్న కంపెనీ విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 41.8 శాతం పెరిగి 40,221 యూనిట్లగా రికార్డైనట్టు కంపెనీ వెల్లడించింది. టూవీలర్ ఎగుమతులు కూడా 43.9 శాతం ఎగిశాయని చెప్పింది. దీంతో గతేడాది 24,658 యూనిట్లుగా ఉన్న టూవీలర్ ఎగుమతులు ఈ ఏడాది 35,485 యూనిట్లుగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. త్రీ-వీలర్ వాహన విక్రయాలు కూడా 11.7 శాతం జంప్ చేసి 5,303 యూనిట్లుగా ఉన్నాయి. అయితే నేటి ట్రేడింగ్ లో కంపెనీ ఫ్లాట్ గా ట్రేడైంది. 
 
మరిన్ని వార్తలు