భారత జీడీపీలో 25మంది కుబేరులు

25 Sep, 2019 16:27 IST|Sakshi

ముంబై: దేశంలోని 25మంది కుబేరులు పదోవంతు దేశ జీడీపీని కలిగి ఉన్నారని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 నివేదికలో వెల్లడైంది. ఈ మేరకు బుధవారం సంస్థ ప్రతినిధులు ఓ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సహ వ్యవస్థాపకుడు యాటిన్ షా స్పందిస్తూ.. సంపదలో ఎక్కువ భాగం వారసత్వంగా లభిస్తుందని పత్రిక ప్రకటనలో తెలిపారు. కాగా, భారత కుబేరులు 53 శాతం సంపదను వారసత్వంగా పొందినా, సంపద సృష్టిపై కూడా వారు దృష్టి పెట్టారని షా విశ్లేషించారు.

హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఐదు ట్రిలియన్‌ డాలర్ల జీడీపీని లక్ష్యంగా పెట్టుకోవడంతో కుబేరుల సంపద మూడు రెట్లు పెరగనుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో సంపద సృష్టి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యువత అధికంగా ఉన్న భారత్‌లో సంపద సృష్టి జరిగే అవకాశం మెండుగా ఉందని, తద్వారా ఐదు ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఐఐఎఫ్ఎల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని వార్తలు