ప్రత్యర్థులతో పోటీకి సై అంటున్న ట్విట్టర్

27 Apr, 2016 14:36 IST|Sakshi
ప్రత్యర్థులతో పోటీకి సై అంటున్న ట్విట్టర్

ట్విట్టర్ తన ప్రత్యర్థి సోషల్ మీడియా సంస్థలతో పోటీకి సిద్ధమైంది. అంచనాలకు మించి ఆదాయాన్ని కోల్పోతుండడంతో, బ్రాండింగ్ అడ్వర్ టైజింగ్ డాలర్ల కోసం ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, స్నాప్ చాట్ లతో పోటీ కి సై అంటోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ట్విట్టర్ షేర్లు 24శాతం పడిపోయాయి.  కంపెనీ నిర్ణయించిన రేట్లకనుగుణంగా బ్రాండ్ మార్కెటర్లు తమ బడ్జెట్లను పెంచడం లేదని ట్విట్టర్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్నిగంటలోనే న్యూయార్క్ మార్కెట్ ట్రేడింగ్ లో ఈ షేర్లు 14శాతం కిందకి జారాయి. ట్విట్టర్ షేర్లు ఆల్ టైమ్ కనిష్టానికి నమోదవుతున్నాయి. ఈ సంస్థకు వాడుకదారుల వృద్ధి కూడా నెమ్మదించడం  ప్రతికూలప్రభావాన్ని పడవేస్తోంది.

మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు కాలినడకన సాగిందని, నెలకు కేవలం 310 మిలియన్ యాక్టివ్ యూజర్లే ఉన్నారని తెలుస్తోంది. కొత్త అడ్వర్ టైజింగ్ ప్రొడక్ట్ రూపకల్పనపై మొదట్లో ఎక్కువగా దృష్టిసారించిన కంపెనీ, ఇప్పుడు ఒక యాడ్ ఫార్మాట్ నుంచి మరో యాడ్ కు త్వరగా బడ్జెట్లను మరల్చుతోందని చీఫ్ ఫైనాన్సియల్ అధికారి ఆంటోని నోటో పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుతం ట్విట్టర్ కు అడ్వర్ టైజింగ్ లో ఎక్కువ డిమాండ్ లేదని ఆయన చెప్పారు.

608 మిలియన్ డాలర్లుగా అంచనా వేసిన ట్విట్టర్ రెవెన్యూ ఈ త్రైమాసికంలో 595 మిలియన్ డాలర్లుగా నమోదైంది. రెండో క్వార్టర్లో కూడా ప్రకటనల ఆదాయం పడిపోనుందని కంపెనీ ముందుగానే అంచనావేస్తోంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా అడ్వర్ టైజింగ్ లకంటే కూడా ఆన్ లైన్ వీడియో బడ్జెట్లను పెంచుకుని, ఎక్కువగా అడ్వర్ టైజింగ్ డాలర్ రెవెన్యూలను పెంచుకోవాలని లక్ష్యంగా కంపెనీ నిర్ణయించింది.ఇప్పటికే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్ లు లైవ్ వీడియోల ప్రచారాలకు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి.

మరిన్ని వార్తలు