10 నిమిషాల పాటు ట్విటర్‌ డౌన్‌

17 Apr, 2018 20:21 IST|Sakshi

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ట్విటర్‌ డౌన్‌ అయినట్టు తెలిసింది. సుమారు 7 గంటల ప్రాంతం నుంచి ట్విటర్‌ ఆగిపోవడం ప్రారంభించింది. దీంతో యూజర్ల నుంచి పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ స్తంభన కొనసాగింది. డౌన్‌డిటెక్టర్‌ అనే ఇంటర్నెట్‌ ట్రాకర్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈశాన్య అమెరికా, యూకేలో కొన్ని ప్రాంతాలు, ఫ్రాన్స్‌, జపాన్‌, భారత్‌ దేశ యూజర్లు ఈ టెక్నికల్‌ సమస్యను ఎదుర్కొన్నారని డౌన్‌డిటెక్టర్‌ రిపోర్టు చేసింది.

ట్విటర్‌కు ప్రధాన వనరు అయిన ఆండ్రాయిడ్‌ యాప్‌ నుంచే 28 శాతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐప్యాడ్‌ యాప్‌ యూజర్లు కూడా ఇదే రకమైన సమస్యను ఎదుర్కొన్నట్టు డౌన్‌డిటెక్టర్‌ తెలిపింది. మొత్తం ఫిర్యాదుల్లో 18 శాతం ఐప్యాడ్‌ యాప్‌ వారివి కూడా ఉన్నట్టు పేర్కొంది. వెబ్‌ సైట్‌ యూజర్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అయితే ఏ కారణం చేత ట్విటర్‌ స్తంభించిపోయిందో ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఇంకా ప్రకటించలేదు. కానీ ట్విటర్‌ డౌన్‌ అయినప్పడు ‘టెక్నికల్‌గా కొంత సమస్య ఉంది. నోటీసు చేసినందుకు ధన్యవాదాలు. దాన్ని ఫిక్స్‌ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. త‍్వరలోనే సాధారణం అయిపోతుంది’ అనే మెసేజ్‌ ఈ ప్లాట్‌ఫామ్‌పై దర్శనమిచ్చింది. ట్విటర్‌ ఇలా డౌన్‌ అవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలా ట్విటర్‌ ఆగిపోయింది. 

మరిన్ని వార్తలు