యాహూలో ట్విట్టర్ విలీనం...?

4 Jun, 2016 15:50 IST|Sakshi
యాహూలో ట్విట్టర్ విలీనం...?

న్యూయార్క్ : ఫ్రీ సోషల్ నెట్ వర్క్, మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్, ఇంటర్నెట్ సేవ ఆధారిత సంస్థ యాహూ లో విలీనం కాబోతుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ విలీనం విషయం చర్చించడానికి ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ లు యాహూ సీఈవో మెరిస్సా మేయర్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. కాలానుగుణంగా ట్విట్టర్ సేవలకు పడిపోతున్న డిమాండ్ తో, ఈ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ను యాహూలో విలీనం చేయాలని యోచిస్తున్నారు. మేనేజ్ మెంట్ మీటింగ్ లో ట్విట్టర్, యాహూ ఎగ్జిక్యూటివ్ లు చాలా గంటలు చర్చలు జరిపినట్టు న్యూయార్క్ పోస్టు నివేదించింది.

వెనువెంటనే సమాచారాన్ని అందించడంలో ట్విట్టర్ ఓ మాధ్యమంగా యూజర్లకు ఉపయోగపడుతోంది. ఈ-మెయిల్ వ్యవస్థతో పాటు వివిధ రకాల వెబ్ ఆధారిత సేవలను అందించడంలో యాహూ ముందంజలో ఉంది. యాహూ నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ట్విట్టర్ ఎక్కువగా ఆసక్తి చూపుతుందని, ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ను త్వరలోనే పూర్తికాబోతుందని రిపోర్టులు చెబుతున్నాయి. అయిత్ ట్విట్టర్ సీఈవో డోర్సే ఈ సమావేశ వివరాలను బయటకు వెల్లడించలేదు. ట్విట్టర్ ఈ వివరాలను బయటికి వెల్లడించకపోవడాన్ని మార్కెట్ వర్గాలు తప్పుబడుతున్నాయి. యాహూ అధికారులు సైతం ఈ విలీన ప్రతిపాదనపై స్పందించడానికి తిరస్కరించారు. యాహూ కోర్ ఇంటర్నెట్ బిజినెస్ ల రెండో రౌండ్ బిడ్ లు టెలికాం దిగ్గజం ఒరిజన్ వద్ద వచ్చే వారం మొదట్లో జరుగనున్నాయి.   

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు