ట్విటర్‌ కొత్త నిబంధన

9 Apr, 2019 18:57 IST|Sakshi

 స్పామ్‌పై  ట్విటర్‌ ఫైట్‌

రోజుకు 400 పాలోవర్లు మాత్రమే

ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే జీతం రూ.100   

ప్రముఖ సోషల్‌ మీడియా వేదిక ట్విటర్‌ స్పామ్‌పై  బెడద నుంచి బయటపడేందుకు చర్యలు చేపట్టింది. స్పామ్‌ మెసేజ్‌లు, ఖాతాలనుంచి ట్విటర్‌ వినియోగదారులను రక్షించేందుకు కీలక చర్య తీసుకుంది. ట్విటర్‌ వినియోగదారుడు ఫాలోఅయ్యే ఖాతాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ఒక ట్విటర్‌ యూజర్‌  ఒక రోజులో ఇతర యూజర్లను ఫాలో అయ్యే సంఖ్యను 400కు తగ్గించింది. గతంలో రోజుకు 1000 అకౌంట్‌లను ఫాలోఅయ్యే అవకాశం ఉంది.  స్పామ్‌ సమస్య నుంచి బయట పడేందుకే ఈ చర్యకు దిగినట్లు ట్విటర్‌ తెలిపింది.  ఈ మేరకు ట్విటర్‌ సాంకేతిక భద్రతా విభాగం ట్వీట్‌ చేసింది.

మరోవైపు ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే అందుకున్న జీతం ఎంతో తెలుసా. అక్షరాలా రూ.100. 2018 సంవత్సరానికిగాను ఆయనకు కంపెనీ 1.40డాలర్లు (సుమారు రూ.100)  జీతం చెల్లించినట్లు సంస్థ వెల్లడించింది. అదేవిధంగా 2018లోనూ డోర్సేకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను ఆయన తిరస్కరించారని, వేతనంగా మాత్రం 1.40 డాలర్లు తీసుకున్నారని సీఈఎస్‌ ఫైలింగ్‌లో ట్విటర్‌ వెల్లడించింది. ట్విటర్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొద్ది సంవత్సరాలుగా సహవ్యవస్థాపకుడైన డోర్సే జీతం తీసుకోవడం లేదని పేర్కొంది.  కాగా  వేతనంతో సహా కంపెనీ ఇచ్చే అన్ని సదుపాయాలను మూడేళ్ల పాటు (2015, 2016, 2017) తీసుకోబోనని గతంలో డోర్సే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు