ట్విటర్‌ కూడా అమ్మేసిందట!

30 Apr, 2018 10:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ డేటా బ్రీచ్‌ ఆందోళన  యూజర్లను ఇంకా వీడకముందే..తాజాగా మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కూడా యూజర్ల డేటాను విక్రయిచిందన్న వార్తలు మరింత కలవరం పుట్టించాయి.  ట్విటర్‌కు చెందిన  యూజర్‌ డేటా కేంబ్రిడ్జ్ ఎనలిటికా చేజిక్కించుకుంది. అనంతరం ఈ సమాచారాన్ని  వినియోగదారుల సమ్మతి లేకుండానే పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థకు విక్రయించింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జిఎస్ఆర్, అలెగ్జాండర్ కోగన్ సొంత వ్యాపార సంస్థ)  భారీ ఎత్తున తమ వినియోగదారుల డేటాను  తస్కరించిందని ట్విటర్‌ మరో  షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. 2015లో కేవలం ఒక రోజులోనే నెలరోజులకు  సంబంధించిన భారీ డేటాను చోరిచేసిందని పేర్కొంది. 

బ్లూంబర్గ్‌ అందించిన స​మాచారం ప్రకారం 2015లో, జీఎస్‌ఆర్‌  సంస్థకు డిసెంబరు 2014 నుంచి ఏప్రిల్ 2015 దాకా పబ్లిక్ ట్వీట్ల రాండం శాంపిల్‌కోసం  ఐదు నెలల వ్యవధిలో  తన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌పై వన్‌టైం యాక్సెస్‌ ఇచ్చామని  ట్విటర్‌  ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ సందర్భంగా నేడేటా లీక్‌ అయ్యిందని  గుర్తించినట్టు వివరించింది.అయితే ఇటీవల డేటా బ్రీచ్‌ నివేదిక నేపథ్యంలో అంతర్గత  సమీక్షలో ఈ విషయాన్ని గుర్తించామనీ, దీంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా, దాని అనుబంధ సంస్థలు,  ప్రకటనకర్తలను తొలగించినట్టు పేర్కొంది. కాగా యూజర్ల సమాచార భద్రతలో ట్విట్టర్ వైఫల్యం, డేటా  దుర్వినియోగాన్ని నిరోధించడంలో విఫలమైనందుకు  మరోసారి తీవ్ర దుమారం రేగింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు